Ola Bike | దిగ్గజ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ దూసుకుపోతోంది. ఇప్పటికే తన ఎలక్ట్రిక్ స్కూటర్లతో (Electric Scooter) దమ్మురేపుతున్న ఓలా ఇకపై ఎలక్ట్రిక్ బైక్స్‌తో (Electric Bike) అదరగొట్టనుంది. కంపెనీ మూడు కొత్త ఎలక్ట్రిక్ బైక్స్‌ను లాంచ్ చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూడు ఎలక్ట్రిక్ బైక్స్‌లో అదిరిపోయే ఫీచర్లు ఉండనున్నాయి. అంతే కాకుండా వీటి రేంజ్ కూడా ఎక్కువగా ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. అందువల్ల ఎవరైనా ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేయాలని భావిస్తూ ఉంటే.. కొంత కాలం ఆగడం ఉత్తమం. ఎందుకంటే ఓలా ఎలక్ట్రిక్ బైక్స్ మార్కెట్లోకి వస్తాయి.
ఓలా బైక్స్ తీసుకువచ్చే మూడు బైక్స్ పేర్లు ఔట్ ఆఫ్ ద వరల్డ్, ఓలా పర్ఫార్మెక్స్, ఓలా రేంజర్‌గా ఉన్నాయి. ఔట్ ఆఫ్ ది వరల్డ్ అనేది మోస్ట్ ప్రీమియం బైక్‌గా ఉండనుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ రేంజ్ 174 కిలోమీటర్లుగా ఉండొచ్చు. అంటే మీరు ఒక్కసారి చార్జింగ పెడితే ఏకంగా 174 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. అంతేకాకుండా ఈ బైక్ టాప్ స్పీడ్ గంటకు 110 కిలోమీటర్లు. దీని ధర 1.5 లక్షల దాకా ఉండొచ్చు. ఇందులో అడ్వాన్స్డ్ డ్రైవర్ సిస్టమ్ ఫీచర్ కూడా ఉండొచ్చు.
ఇ-బైక్‌పై రూ.30,000 డిస్కౌంట్, ఒక్కసారి చార్జ్ చేస్తే 35 కి.మి. వెళ్లొచ్చు!
ఇక ఓలా పర్ఫార్మెక్స్ అనేది మిడ్ రేంజ్ బైక్. ఇది మూడు రకాల వేరియంట్ల రూపంలో లభించనుంది. ఇది ఒక్కసారి చార్జింగ్ పెడితే 91 నుంచి 174 కిలోమీటర్లు వరకు వెళ్లొచ్చు. ఈ బైక్ వేయింట్ ప్రాతిపదికన రేంజ్ మారుతుంది. ఇక వీటి స్పీడ్ గంటలకు 91 నుంచి 95 కిలోమీటర్ల వరకు ఉండనుంది. వీటి ధర రూ. 1.05 లక్షల నుంచి రూ. 1.25 లక్షల దాకా ఉంటుంది.
గుడ్ న్యూస్.. రూ.2,300 పతనమైన బంగారం ధర.. కొనే వారికి పండగే!
అలాగే ఓలా రేంజర్ బైక్ కూడా ఉంటుంది. ఇది మోస్ట్ ఆఫర్డబుల్ బైక్. ఒక్కసారి చార్జింగ్ పెడితే ఆ బైక్ 80 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. టాప్ స్పీడ్ గంటకు 91 కిలోమీటర్లు. ఈ బైక్ కూడా వివిధ రకాల వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. దీని ధర రూ. 85 వేల నుంచి రూ. 1.05 లక్షల దాకా ఉండొచ్చు. ఇకపోతే కంపెనీ ఫిబ్రవరి 9న కొత్త ప్రొడక్ట్‌ను మార్కెట్‌లోకి తీసుకురాబోతోంది. కాగా ఓలా ఎలక్ట్రిక్ పలు రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లను అందుబాటులో ఉంచింది. ఓలా ఎస్1 ఎయిర్, ఓలా ఎస్1 ప్రో, ఓలా ఎస్1 అనేవి మూడు రకాల స్కూటర్లు.