Google Engineer: ఇటీవలి కాలంలో ఆర్థిక మాంద్యం భయాలు ఎక్కువైన సంగతి తెలిసిందే. తమ ఉద్యోగం ఎప్పటివరకు ఉంటుందో, ఎప్పుడు ఊడుతుందోనని భయపడిపోతున్నారు. చాలా కంపెనీలు ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగులను పెద్ద మొత్తంలో పీకేస్తున్నాయి. అమెజాన్, మెటా, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, గూగుల్ సహా దిగ్గజ సంస్థలు ఉద్యోగులకు లేఆఫ్స్ విధిస్తున్నాయి. అయితే ఇదే క్రమంలో కొందరు ఉద్యోగులను అత్యంత అవమానకర రీతిలో సాగనంపడంపై విమర్శలు వస్తున్నాయి. ఇటీవల ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ 12000 మంది ఉద్యోగుల్ని తీసేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
మొన్నటికి మొన్న ఒక గూగుల్ ఉద్యోగి.. తన అమ్మ చనిపోయాక ఆ కార్యక్రమాలకు హాజరై తిరిగి ఆఫీసులో అడుగుపెట్టిన 2 రోజులకే.. తన ఉద్యోగం ఊడినట్లు సందేశం వచ్చింది. దీంతో సదరు వ్యక్తి భావోద్వేగంతో లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ పెట్టాడు. తన తల్లికి ఆరోగ్యం బాగోలేకపోయినప్పటికీ.. ఆఫీసు కోసం ఎక్కువగా పనిచేశానని, అయినా తనను తీసేసిందని చెప్పడం పలువురిని కన్నీరు పెట్టించింది.
97370346
హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్.. అదానీ షేర్ల పతనం.. భారత్‌తో సవాల్ వద్దంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్.. అసలేమైంది?
ఇప్పుడు అదే రీతిలో అదే గూగుల్ మరో మహిళా ఇంజినీర్‌ను తీసేయడం చర్చనీయాంశంగా మారింది. ఐదేళ్లుగా గూగుల్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తు్న్న ఒక మహిళా ఉద్యోగి.. తన కుటుంబంతో కలిసి సరదాగా విహార యాత్రకు వెళ్లింది. ఆనందంగా ఉన్న సమయంలో తన మేనేజర్ నుంచి లింక్డ్‌ఇన్‌లో ఒక మెసేజ్ వచ్చింది. ఓపెన్ చేసి చూడగానే షాక్ అవ్వడం తన వంతైంది. ఆమెను ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నట్లు మేనేజర్ చెప్పాడు. తనకు ఎలాంటి ముందస్తు సమాచారం లేదని వాపోయింది. అయితే ఆమె ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో చూద్దామని చాలా మంది సహోద్యోగులు ఆమెను సంప్రదించారు. ఆ మేనేజర్ ఆమెకు క్షమాపణలు చెప్పాడు. తనను కాంటాక్ట్ అయ్యేందుకు.. వేరే మార్గం కనిపించలేదని అన్నాడు.
ఇదే సమయంలో తాను గూగుల్‌పై ఆరోపణలు చేసింది. కష్టపడి పనిచేస్తున్నప్పటికీ వదిలేయడం ఎంతవరకు సమంజసం, నిబంధనలు పాటించకుండా, తన గురించి ఏం తనిఖీ చేయకుండా తీసేశారని వాపోయింది. ఆకస్మిక తొలగింపు తనను షాక్‌కు గురిచేసిందని, దీని నుంచి తేరుకోవడం కాస్త కష్టమేనని చెప్పింది.
భారీగా కుప్పకూలిన బంగారం, వెండి ధరలు.. భలే మంచి ఛాన్స్.. ఇవాళ్టి రేట్లు ఇవే..
గూగుల్‌లో వేర్వేరు విభాగాలకు చెందిన 12 వేల మందికిపైగా ఉద్యోగులను ఇటీవల తొలగించింది. ఇదే సమయంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కంపెనీ గత రెండేళ్లుగా అవసరమైన దాని కంటే ఎక్కువగా ఉద్యోగులను నియమించుకుందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఖర్చులు పెరుగుతున్నాయని, అందుకే లేఆఫ్స్ విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇదే సమయంలో చాలా మంది ఉద్యోగులు తమ లేఆఫ్ గాథలను సోషల్ మీడియాల్లో పోస్ట్ చేస్తున్నారు. ఇది పలువురిని కంటతడి పెట్టిస్తోంది. ఇదే క్రమంలో వారికి ఇతర ఆఫర్లు ఇస్తూ అదే పోస్ట్‌ల కింద పలువురు కామెంట్స్ చేస్తుండటం విశేషం.
Read Latest
Business News and Telugu News
20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.
Also Read:
అదానీకి రూ.5 లక్షల కోట్ల లాస్.. అంతా హిండెన్‌బర్గ్ వల్లే.. దీని వెనకుంది ఎవరు? ఈ విషయాలు మీకు తెలుసా?
లక్ష ఇన్వెస్ట్ చేస్తే రూ.6 కోట్ల లాభం.. రెండు సార్లు బోనస్.. ఈ స్టాక్ మీ దగ్గరుందా?