నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్‌లో విచిత్రం చోటుచేసుకుంది. ఓ రైతు తన పంట కోసం బోర్ వేస్తున్న క్రమంలో.. ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఒక దగ్గర కొత్తగా బోర్ వేస్తుంటే.. పక్కనున్న స్థలంలో ఉన్న బోర్ నుంచి నీళ్లు ఎగజిమ్ముతూ బయటకువచ్చాయి. అంతేకాకుండా ఆ నీళ్లతో పాటు ఆ బోర్ పైపులు కూడా బయటికి వచ్చాయి. అంతెత్తున నీళ్లతో పాటు పైపులు కూడా బయటకు రాగా.. కొంత ఎత్తుకు వెళ్లిన తర్వాత ఆ పైపులు విరిగి కింద పడిపోయాయి. కాగా.. కొత్తగా వేస్తున్న బోర్‌లో కూడా నీళ్లు దండిగానే పడ్డాయి. అయితే.. పాత బోర్‌కు సమీపంలోనే మరో బోర్ వేయటం వల్ల ప్రెషర్‌కు పైపులతో సహా నీళ్లు బయటికి వచ్చినట్టు స్థానికులు భావిస్తున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండగా.. ప్రజలు కూడా ఆసక్తికరంగా వీక్షిస్తున్నారు.
97609524
Read More Telangana News And Telugu News