ఖరీదైన ప్లాన్‌లో మరిన్ని బెనిఫిట్స్‌ అందిస్తున్న నెట్‌ఫ్లిక్స్‌.. కంపెనీ ప్లాన్‌ ఇదే..

ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఫ్రీ పాస్‌వర్డ్‌ షేరింగ్ విధానానికి ముగింపు పలికిన విషయం తెలిసిందే. దీంతో ఇటీవల కాలంలో చాలా మంది సబ్‌స్ర్కైబర్స్‌ను కోల్పోయింది. దీంతో నష్టాలను కవర్ చేయడానికి, సబ్ స్ర్కైబర్స్‌ను తిరిగి పెంచుకోవడానికి తాజాగా కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. ప్రీమియం టైర్ ప్లాన్‌లో సబ్‌స్క్రైబర్స్ కోసం అదనంగా మరికొన్ని ప్రయోజనాలను కల్పించింది.

* స్పేషియల్ ఆడియో సపోర్ట్‌

నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు రూ.649 నెల ప్లాన్‌కు అనేక ప్రయోజనాలను జోడించింది. ఈ ప్లాన్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ షోల మొత్తం ఆడియో ఎక్స్ పీరియన్స్‌ను మెరుగుపర్చే స్పేషియల్ ఆడియో సపోర్ట్‌తో కంటెంట్‌ను అందిస్తుంది.

Anganwadi Jobs: మహిళా అభ్యర్థులకు గుడ్ న్యూస్.. అంగన్ వాడీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..

* 3D ఆడియో ఎఫెక్ట్‌

స్పేషియల్ ఆడియో(Spatial audio ) బేసిక్‌గా 360-డిగ్రీల ఆడియో ఎక్స్‌పీరియన్స్ అందించే 3D ఆడియో ఎఫెక్ట్‌తో కంటెంట్‌ను చూడటానికి అవకాశం ఉంటుంది. స్పేషియల్ ఆడియో ఫీచర్ పనితీరును ఈజీగా గుర్తించచ్చని, సౌండ్ తేడాను చూడటానికి సౌండ్‌బార్, హోమ్ థియేటర్ సిస్టమ్ అవసరం లేదని నెట్‌ఫ్లిక్స్ స్పష్టం చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో 700 కంటే ఎక్కువ టైటిల్స్‌కు స్పేషియల్ ఆడియో సపోర్ట్ ఉందని స్ట్రీమింగ్ దిగ్గజం పేర్కొంది. 5.1 లేదా Atmos వంటి సంకేతాలతో వెతకడం ద్వారా మీకు ఇష్టమైన సినిమా లేదా షోకు స్పేషియల్ ఆడియో సపోర్ట్ ఉందా లేదా అని చేక్ చేసుకోవచ్చని నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది.

* ఆరు డివైజ్‌ల్లో డౌన్‌లోడ్ కంటెంట్‌

తాజాగా నెట్‌ఫ్లిక్స్ తన సబ్‌స్ర్కైబర్స్ కోసం మరో అదిరిపోయే ఆఫర్ అందించింది. తాజాగా ఆరు డివైజ్‌ల్లో ఒకే నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ ఉంటే, డౌన్‌లోడ్ చేసిన కంటెంట్‌ను వాటన్నింటిలో చూడటానికి అవకాశం కల్పించింది. అంతకు ముందు, ప్రీమియం నెట్‌ఫ్లిక్స్ కంటెంట్‌ని యాక్సెస్ చేయడానికి నాలుగు డివైజ్‌ల్లో డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది.

* 4K లేదా UHD రిజల్యూషన్‌

వీడియో కంటెంట్‌ను 4K లేదా UHD రిజల్యూషన్‌లో స్ట్రీమింగ్ క్వాలిటీని పొందవచ్చు. అయితే కంటెంట్ ఆ నాణ్యతలో అందుబాటులో ఉంటేనే ఈ ప్రయోజనాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రయాణ సమయాల్లో కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఆఫ్‌లైన్‌లో చూసేందుకు వినియోగదారులు మొగ్గుచూపుతున్నారని, దీంతో నాలుగు నుంచి ఆరు డివైజ్‌లకు డౌన్‌లోడ్ కంటెంట్ అప్‌గ్రేడ్ చేసినట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది.

భారత్‌లో మిడ్-టైర్ ప్లాన్‌ సబ్‌స్క్రైబర్స్ ఎక్కువగా

నెట్‌ఫ్లిక్స్‌కు భారత్‌లో నెలకు రూ.499 ఖరీదు చేసే మిడ్-టైర్ ప్లాన్‌ సబ్‌స్క్రైబర్స్ ఎక్కువగా ఉన్నారు. ఈ ప్లాన్ ద్వారా కేవలం రెండు డివైజ్‌ల్లో కంటెంట్‌ స్ట్రీమ్ చేయడానికి, డౌన్‌లోడ్ చేయడానికి అవకాశం ఉంది. మరోపక్క కస్టమర్లు తమ హోమ్ నెట్‌వర్క్ వెలుపల తమ అకౌంట్‌ షేర్‌ చేసుకునే అవకాశాన్ని నెట్‌ఫ్లిక్స్ తగ్గిస్తోంది. ఇలాంటి చర్యలు కంపెనీకి మరింత నష్టాన్ని చూకూర్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *