ChatGPT: అమెరికాకు చెందిన ఓపెన్ఏఐ అనే సంస్థ సృష్టించిన కృత్రిమ మేధా చాట్‌బాట్ ‘చాట్ జీపీటీ’ దూసుకొస్తోంది. గూగుల్ వంటి దిగ్గజ సంస్థలకు సవాల్ విసురుతూ రాకెట్ వేగంతో ప్రపంచాన్ని చుట్టేస్తోంది. ఇప్పటికే లక్షల మంది యూజర్లు దీనికి ఆకర్షితులవుతున్నారు. ఎంతగా అంటే దీనిని లాంఛ్ చేసిన తర్వాత 2 నెలల్లోనే 100 మిలియన్లు (10 కోట్లు) మంది ఈ చాట్ జీపీటీ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడంతో ప్రపంచ రికార్డ్ నెలకొల్పింది. సిమిలర్‌వెబ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఈ ఏడాది జనవరిలో రోజుకు 13 మిలియన్ల మంది యూజర్లు ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్, టిటాక్ వంటివి 100 మిలియన్ యూజర్లను చేరుకునేందుకు 2.5 ఏళ్లు, 9 నెలల సమయం తీసుకుంటే.. చాట్ జీపీటీ కేవలం 2 నెలలే తీసుకోవడం గమనార్హం.
2022, డిసెంబర్‌లో చాట్ జీపీటీని ప్రపంచానికి పరిచయం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) సాయంతో పని చేసే చాట్‌బాట్‌ని ఎలాన్ మస్క్ బలపరుస్తోన్న ఓపెన్ఏఐ రూపొందించింది. చాట్ జీపీటీ సమస్త అంశాలతో మనుషులతో మాటామంతీ జరపగలదు. వికీపీడియా, దేశ దేశాల పత్రికలు, ఆన్‌లైన్ గ్రంథాల్లో అందుబాటులో ఉన్న లక్షల పుటల సమాచారాన్ని సంగ్రహించిన చాట్ జీపీటీ.. మన ప్రశ్నలకు సమాధానాలను అపార విజ్ఞాన భాండాగారం నుంచి క్షణాల్లో సేకరించి రాతపూర్వకంగా అందిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వెబ్ డేటాను కేవలం కాపీ కొట్టడానికి మాత్రమే అది పరిమితం కాదు. మానవ మేధలా తనకు అందుబాటులోని డేటాల మధ్య సంబంధాన్ని గుర్తించి, వాటి మధ్య ఉన్న భేదాలను సమన్వయపరిచి జవాబులిస్తుంది. అందుకే ఇది మనుషులనే మించిపోతుందేమోననే భయాలు మొదలయ్యాయి.
సిమిలర్ వెబ్ అంచనాల ప్రకారం.. chat.openai.com వెబ్‌సైట్ గడిచిన వారంలో రోజుకు 25 మిలియన్ల మంది విజిట్ చేశారు. గడిచిన నెల రోజుల్లో సైట్ ట్రాఫిక్ రోజుకు 3.4 శాతం పెరిగినట్లు నివేదిక తెలిపింది. జనవరి 31న అత్యధికంగా 28 మిలియన్ల మంది యూజర్లు ఈ సైట్‌ని విజిట్ చేశారు. సాధారణంగా 15.7 మిలియన్ల మంది యూనిక్ విజటర్స్ ఉంటారు. ప్రస్తుతం ఉన్న గూగుల్‌తో పాటు ఇంటర్‌నెట్ దిగ్గజాలకు ఆందోళన మొదలైంది. చాట్ జీపీటీని తలదన్నే విధంగా కృత్రిమ మేధా గల వెబ్‌సైట్ రూపొందించాలని గూగుల్ సీఈఐ తమ ఉద్యోగులను ఆదేశించినట్లు సమాచారం. ఏఐ అనేది ప్రస్తుతం ఉన్న అత్యాధుని టెక్నాలజీగా సుందర్ పిచాయ్ గతంలో పేర్కొన్నారు.
ఓపెన్ఏఐ ఇటీవలే చాట్ జీపీటీ ప్లస్ మోడల్‌ను తీసుకొచ్చింది. అయితే, ఈ చాట్ జీపీటీ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ నెల వారీగా 20 డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమెరికాలనో ఈ చాట్ జీపీటీ ప్లస్ అందుబాటులో ఉంది. దీని ద్వారా పీక్ టైమ్ లోనూ యూజర్లు సేవలను పొందవచ్చు. అలాగే.. వేగంగా, కొత్త ఫీచర్లను పొందవచ్చు.
Read Latest
Business News and Telugu News
20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.
Also Read:
అదానీ గ్రూప్ సంచలనం.. ఇన్వెస్టర్లందరికీ తిరిగి డబ్బులు.. అసలేమైంది?
అదానీ సంక్షోభంపై స్పందించిన ‘ఆర్‌బీఐ’.. బ్యాంకుల పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు!
గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన గోల్డ్, సిల్వర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు ఇవే..