కొంత మంది యువకులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. అమ్మాయిలకు రిక్వెస్ట్ లు పెట్టి గాలం వేస్తున్నారు. అవతలి వారి రిక్వెస్ట్ లకు స్పందించేవారిని, మెసెజ్ లు చేసి ముగ్గులోకి దింపుతున్నారు. కల్లి బుల్లి కబుర్లు చెప్పి మోసాలకు పాల్పడుతున్నారు. తొలుత స్నేహం పేరుతో పరిచయం పెంచుకుని, ఆతర్వాత ప్రేమ, పెళ్లి అంటూ చీటింగ్ చేస్తున్నారు. ఈ కోవకు చెందిన మోసాలు ప్రతిరోజు వార్తలలో ఉంటున్నాయి. బీహర్ లో జరిగిన ఇలాంటి ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది.
పూర్తి వివరాలు.. బీహార్‌లోని (Bihar) నలందలో ఓ ప్రేమజంటను బలవంతంగా పెళ్లి జరిపించడం తీవ్ర కలకలం మారింది. పరీక్ష సాకుతో, రాహుయ్ తన స్నేహితురాలిని కలవడానికి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చేరుకున్నాడు. అక్కడే ఉన్న బాలిక కుటుంబ సభ్యులు కొద్ది రోజులుగా వీరి వ్యవహరాన్ని గమనిస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరిని పట్టుకుని బలవంతంగా పెళ్లి చేశారు. పెళ్లి విషయం అబ్బాయి కుటుంబీకులకు తెలియడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో అబ్బాయి కుటుంబ సభ్యులు గ్రామానికి పెద్ద ఎత్తున వచ్చారు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. కాగా, ఈ గొడవను అడ్వాంటేజ్ గా తీసుకున్న ప్రేమికుడు అక్కడి నుంచి మెల్లగా పరారయ్యాడు.
ప్రేమగా మారిన ఫేస్‌బుక్‌తో పరిచయం
ఆరు నెలల క్రితమే ఫేస్‌బుక్‌లో తమకు స్నేహం ఏర్పడిందని బాలిక చెప్పింది. ఆ తర్వాత ఇద్దరూ గంటల తరబడి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. శుక్రవారం ఆమెను కలవాలని ప్రియుడు పిలిచాడు. పని నిమిత్తం బయటకు వెళ్లబోతుండగా యువతిని పెళ్లి ప్రపోజ్ చేశాడు. వీరిని గమనించిన యువతి కుటుంబ సభ్యులు.. అబ్బాయిని పెళ్లి చేసుకొమన్నారు. దీంతో ఇద్దరూ కలిసి కుటుంబ సభ్యులతో కలిసి రిజిస్ట్రర్ ఆఫీస్ చేరుకుని పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం అబ్బాయి కుటుంబ సభ్యులకు తెలిసింది. అబ్బాయి, అమ్మాయి పక్షాల మధ్య వాగ్వాదం జరగడంతో, అవకాశం చూసి అబ్బాయి పారిపోయాడు.
ఎలాంటి రాతపూర్వక ఫిర్యాదు అందలేదు –
ఈ ఘటనకు సంబంధించి బీహార్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందిందని తెలిపారు. అయితే.. ఇప్పటి వరకు ఎవరి నుంచి రాతపూర్వక దరఖాస్తు రాలేదు. ఫిర్యాదు అందిన తర్వాత చర్యలు తీసుకుంటామని పోలీసులు అన్నారు. అదే సమయంలో పెద్దఎత్తున గొడవ జరగడం చూసి అటుగా వెళ్తున్న విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు గుమిగూడారు. ఈ ఘటన ప్రస్తుతం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.