రికార్డు లెవెల్​లో చాట్​జీపీటీ యూజర్లు…

రికార్డు లెవెల్​లో చాట్​జీపీటీ యూజర్లు… వెలుగు బిజినెస్​ డెస్క్​: లాంచ్​ అయిన  రెండు నెలల్లోనే  పాపులర్​ ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ టూల్​ చాట్​జీపీటీ 10 కోట్ల యూజర్లను సంపాదించుకుని రికార్డు సాధించింది. సిమిలర్​వెబ్​ రిపోర్టు ప్రకారం జనవరి నెలలో రోజూ లక్షలాది మంది కొత్త యూజర్లను చాట్​ జీపీటీ తెచ్చుకుందని పేర్కొంది.  10 కోట్ల యూజర్ల మార్కును అందుకోవడానికి  సోషల్​ మీడియా యాప్స్​ ఇన్​స్టాగ్రామ్​కు రెండున్నరేళ్లు​, టిక్​టాక్​కు 9 నెలలు పట్టిందని సిమిలర్​వెబ్​ ఈ రిపోర్టులో వెల్లడించింది. కిందటేడాది డిసెంబర్​లోనే చాట్​జీపీటీని లాంచ్​ చేశారు. ఎలన్​మస్క్​ పెట్టుబడి పెట్టిన ఓపెన్​ఏఐ ఈ చాట్​ జీపీటీని డెవలప్​ చేసింది. యూజర్​ నుంచి ఇన్​స్ట్రక్షన్​ తీసుకుని దానికి వివరమైన బదులివ్వడంపై ఈ చాట్​ బాట్​కు ట్రెయినింగ్​ ఇచ్చారు. యూజర్లు తమకు ఏం కావాలో ఫీడ్​ చేస్తే చాలు….ఈ చాట్​బాట్​ రిప్లయ్​ ఇచ్చేస్తుంది.

ఇంతలా దూసుకెళ్లిన కన్జూమర్​ యాప్​ లేదు…

20 ఏళ్ల ఇంటర్​నెట్​స్పేస్​లో ఇంత వేగంగా దూసుకెళ్లిన కన్జూమర్​ ఇంటర్​నెట్​యాప్​ను చూడలేదని యూబీఎస్​ రిసెర్చ్​ చెప్పినట్లు సిమిలర్​వెబ్​ డేటా ప్రకటించింది. సిమిలర్​వెబ్​ అంచనాల ప్రకారం చాట్​.ఓపెన్​ఏఐ.కామ్​ వెబ్​సైట్​ గత వారం రోజులలో రోజుకి 2.5 కోట్ల మంది విజిటర్లను ఆకట్టుకోగలిగినట్లు పేర్కొంది.  నెల రోజులకి చూస్తే ఈ వెబ్​సైట్​ట్రాఫిక్​ సగటున రోజుకి 3.4 శాతం పెరిగినట్లు వివరించింది. జనవరి 31 నాడు ఒక్క రోజునే ఈ వెబ్​సైట్​ను 2.8 కోట్ల మంది  విజిటర్లు చూశారు. ఇందులో 1.57 కోట్ల మంది యూనిక్​ విజిటర్లేనని సిమిలర్​ వెబ్​ తెలిపింది.

మార్కెట్లో చాట్​ జీపీటీ సంచలనం చూసి గూగుల్​ వంటి ఇంటర్​నెట్​ దిగ్గజాలు ఆశ్చర్యపోతున్నాయి. ఇటీవల జరిగిన ఎర్నింగ్స్​ కాల్ లో  ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ శక్తి–సామర్ధ్యాల గురించి ​ఎనలిస్టులతో  గూగుల్​ సీఈఓ చాలా సార్లు మాట్లాడారు. ఏఐని వాడుకోవడానికి ప్రపంచం చాలా ఆసక్తితో ఎదురు చూస్తోందని సుందర్​పిచాయ్​ ఈ సందర్భంగా ప్రస్తావించారు. తాము ప్రస్తుతం పనిచేస్తున్న అత్యంత శక్తివంతమైన టెక్నాలజీ ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్సేనని అన్నారు. చాట్​జీపీటీకి పోటీగా తాము ఒక ప్రొడక్టును డెవలప్​ చేస్తున్నట్లు చైనా ఇంటర్​నెట్​ కంపెనీ బైదు ఇటీవలే ప్రకటించింది కూడా.

ఓపెన్​ఏఐ సబ్​స్క్రిప్షన్​ మోడల్​​…

ఓపెన్​ఏఐ ప్లస్​మోడల్​ పేరుతో సబ్​స్క్రిప్షన్​ మోడల్​చాట్​జీపీటీని ఇటీవలే ఓపెన్​ఏఐ తెచ్చింది. ప్రస్తుతానికి అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉండే ఈ మోడల్​ కింద నెలకు 20 డాలర్లను సబ్​స్క్రిప్షన్​గా నిర్ణయించారు. పీక్​టైమ్స్​లో కూడా ప్లస్​మోడల్​ యూజర్లకు చాట్​జీపీటీ సేవలు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు, ప్లస్​ యూజర్లకు వేగమైన రెస్పాన్స్​, కొత్త ఫీచర్లకు ముందస్తు యాక్సెస్​ వంటి ఎట్రాక్షన్లనూ ఇస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *