రైటర్ పద్మభూషణ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. రెండ్రోజుల్లోనే సుహాస్ గట్టిగా కొట్టేశాడుగా!

తెలుగు ఇండస్ట్రీలో నటుడు సుహాస్ (Suhas) మంచి మంచి పాత్రలు దక్కించుకుంటున్నాడు. ‘కలర్ ఫొటో’ సినిమాతో సోలో హీరోగా హిట్ కొట్టిన ఈ యంగ్ యాక్టర్.. ఆ తర్వాత కూడా డిఫరెంట్ రోల్స్ ఎంచుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతున్నాడు. గతేడాది చివరన అడివి శేష్ హీరోగా నటించిన హిట్2 (HIT2) చిత్రంలో సైకో పాత్రలో నటించిన మెప్పించిన సుహాస్.. రీసెంట్‌గా ‘రైటర్ పద్మనాభం’ (Writer Padmabhushan) చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. థియేట్రికల్ రిలీజ్‌కు ముందే ప్రీమియర్ షోల ద్వారా పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ‘రైటర్ పద్మభూషణ్’ మూవీ ఫిబ్రవరి 3న విడుదలైన హిట్ టాక్ తెచ్చుకుంది. అంతేకాదు బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది.

‘రైటర్ పద్మభూషణ్’ విడుదలైన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 3.6 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇది సుహాస్ కెరీర్‌లోనే అత్యుత్తమని చెప్పొచ్చు. సినిమా కథ విషయానికొస్తే.. విజయవాడలోని ఓ ప్రాంతీయ గ్రంథాలయంలో అసిస్టెంట్ లైబ్రేరియన్‌గా పనిచేసే పద్మభూషణ్ అనే కుర్రాడి చుట్టూ తిరుగుతుంది. అయితే రైటర్ అనిపించేందుకు తను పడే పాట్లు, చేసే తప్పులు, ఎదుర్కొనే సంఘర్షణను చాలా చక్కగా పండించగలిగాడు సుహాస్.

చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిలింస్ బ్యానర్లపై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన చిత్రానికి షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించాడు. టీనా శిల్పరాజ్ కథానాయికగా నటించింది. శేఖర్ చంద్ర, కళ్యాణ్ నాయక్ స్వరాలు సమకూర్చగా.. ఆశిష్ విద్యార్థి, రోహిణి మొల్లేటి, శ్రీగౌరీ ప్రియారెడ్డి, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషించారు.

ఇదిలా ఉంటే, పక్కింటి తరహా కుర్రాడి పాత్రలకు టాలీవుడ్‌లో ఇప్పుడు సుహాస్ బెస్ట్ ఆప్షన్‌గా మారిపోయాడు. అలాగని హీరో క్యారెక్టర్లకే ఎదురుచూడకుండా నటుడిగా అన్ని రకాల పాత్రలు పోషిస్తు్న్నాడు సుహాస్. ఇది శుభ పరిణామమే కాగా.. ఇటీవలే ‘ఆనందరావు అడ్వంచర్స్’ (Anandrao Adventures)’ టైటిల్‌తో మరో చిత్రానికి శ్రీకారం చుట్టాడు. రామ్ పసుపులేటి దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రంలో సుహాస్ లీడ్ రోల్ పోషించనుండగా.. క్సాపీ స్టూడియోస్ పతాకంపై ఉదయ్ కోలా, విజయ్ శేఖర్ అన్నే, సురేష్ కోతింటి నిర్మిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జె మేయర్ స్వరాలు సమకూరుస్తున్న చిత్రానికి సుహాసిని రాహుల్, మురళీ జంపన సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Read Latest

Tollywood updates and

Telugu news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *