రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ నేత మృతి

రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ నేత మృతి ఒడిశాలోని బింజర్‌పూర్ మాజీ ఎమ్మెల్యే, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నాయకుడు అర్జున్ చరణ్ దాస్ శనివారం (ఫిబ్రవరి 4) జాజ్‌పూర్ సదర్ పోలీసు పరిధిలోని బారుహాన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. దాస్ తన స్నేహితుడితో కలిసి BRS  రైతుల సమావేశానికి హాజరయ్యేందుకు మోటర్‌బైక్‌పై భువనేశ్వర్‌కు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఖరస్రోటా నదిపై ఉన్న వంతెనపై ఇసుకతో కూడిన హైవా ట్రక్ అతని వాహనాన్ని ఢీకొట్టిన్నట్టు అధికారులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన దాస్ ను వెంటనే జిల్లా ప్రధాన ఆసుపత్రి (డీహెచ్‌హెచ్)కు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.  ఈ ఘటనలో దాస్ తో పాటే ఉన్న స్నేహితుడు మొహంతి పరిస్థితి విషమించడంతో SCB మెడికల్ కాలేజీ, ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనకు సంబంధించి జాజ్‌పూర్ సదర్ పోలీసులు కేసు నమోదు చేసి ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు. ట్రక్ డ్రైవర్ పరారీలో ఉన్నాడని, అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. దాస్ 1995 నుండి 2000 వరకు జాజ్‌పూర్ జిల్లాలోని బింజర్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఇటీవల హైదరాబాద్‌లో  ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్, ఆయన కుమారుడు శిశిర్ గమాంగ్ సహా రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేరారు.

  ©️ VIL Media Pvt Ltd.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *