Multibagger Stocks: ఇన్వెస్టర్లను ధనవంతుల్ని చేసే షేర్లు.. స్టాక్ మార్కెట్లలో బోలెడు ఉన్నాయి. మనకు మార్కెట్లలో అన్నింటిపై మంచి అవగాహన ఉండి అప్పుడు ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వాటంతటవే వస్తాయి. అప్పుడు బంపర్ రిటర్న్స్ దక్కించుకోవచ్చు. స్టాక్ మార్కెట్లలో అలాంటి స్టాక్స్ చాలా ఉంటాయి. కొన్ని కొద్ది రోజుల్లోనే ఇన్వెస్టర్లను మిలియనీర్లను చేయొచ్చు. కొన్నింటికి ఇంకాస్త ఎక్కువ సమయం పట్టొచ్చు. కానీ.. సరైన స్టాక్స్‌ను ఎంచుకొని కాస్త ఓపికతో ఉంటే.. అప్పుడు లాభాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరో ముఖ్య విషయం.. స్టాక్స్‌ను ఎంచుకునే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మర్చిపోవద్దు.
ఇంకా మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో పెట్టుబడులు పెడితే.. ఎన్నో రెట్ల లాభం వస్తుంది. షేరు అసలు విలువకు ఎన్నో రెట్లు పెరిగితే దానిని మల్టీబ్యాగర్ స్టాక్స్ అంటారు. కానీ వీటిని దాదాపు అవి గరిష్ట విలువలకు చేరాక గుర్తించే వారే ఎక్కువ. అయితే.. మార్కెట్లను జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే.. వీటిని కనిపెట్టడం పెద్ద కష్టమేం కాకపోవచ్చు. అలాంటి ఒక మల్టీబ్యాగర్ స్టాక్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇది ఇన్వెస్టర్లను కోటీశ్వరుల్ని చేయడం గమనార్హం.
అదానీ గ్రూప్ సంచలనం.. ఇన్వెస్టర్లందరికీ తిరిగి డబ్బులు.. అసలేమైంది?
కేపీఆర్ మిల్ లిమిటెడ్ (KPR Mill Limited) స్టాక్ ఇన్వెస్టర్లకు నిలకడగా లాభాలు అందిస్తూ వస్తోంది. గార్మెంట్స్, అప్పారెల్ ఇండస్ట్రీకి చెందిన ఈ స్టాక్.. కళ్లుచెదిరే లాభాల్ని ఇచ్చింది. ఈ స్టాక్‌లో 11 సంవత్సరాల కిందట రూ.లక్ష పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పుడు ఏకంగా రూ.6 కోట్ల లాభం వచ్చింది. ఓపిక ఉంటే చాలు మంచి లాభాలు వస్తాయని చెప్పేందుకు ఇదే నిదర్శనం.
హిండెన్‌బర్గ్ రిపోర్ట్.. FPO రద్దు.. తొలిసారి నోరు విప్పిన గౌతమ్ అదానీ.. అసలేమైందో చెప్పేశారుగా!
2012, ఫిబ్రవరి 3న KPR Mill Limited స్టాక్ షేరు ధర రూ.8.85 వద్ద ఉండేది. ఇక అప్పుడు ఇందలో రూ.లక్ష ఇన్వెస్ట్ చేస్తే.. 11,300 షేర్లు వచ్చేవి. ఇక 2016 నవంబర్‌లో 1:2 రేషియోలో ఒకసారి, 2021 సెప్టెంబర్‌లో 1:5 నిష్పత్తిలో మరోసారి.. ఇలా రెండుసార్లు బోనస్ ప్రకటించింది. దీంతో ఆ షేర్ల సంఖ్య ఇప్పుడు 1,13,000 అయ్యాయి. ప్రస్తుతం స్టాక్ ధర BSEలో 2023, ఫిబ్రవరి 3న రూ.533 వద్ద ఉంది. దీంతో ఈ లెక్కన 11 ఏళ్ల కిందట రూ.లక్ష ఇన్వెస్ట్‌మెంట్ పెట్టినవారికి రూ.6 కోట్లకుపైగా లాభం వచ్చింది.
బంపర్ ఆఫర్.. టాటా కార్లపై భారీ డిస్కౌంట్లు.. ఒక్కో మోడల్‌పై ఒక్కో తీరు..!
Read Latest
Business News and Telugu News
20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.
Also Read:
హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్.. అదానీ షేర్ల పతనం.. భారత్‌తో సవాల్ వద్దంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్.. అసలేమైంది?
భారీగా కుప్పకూలిన బంగారం, వెండి ధరలు.. భలే మంచి ఛాన్స్.. ఇవాళ్టి రేట్లు ఇవే..