అక్కినేని హీరోల్లో అఖిల్ కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘ఏజెంట్’. ఈ సినిమా కోసం అఖిల్ చాలా ఎక్కువగా కష్టపడ్డాడు. సిక్స్ ప్యాక్ బాడీ పెంచాడు. బీస్ట్ లుక్‌లో నటించాడు. ఇప్పటికే విడుదలైన టీజర్‌లో అఖిల్ లుక్‌కి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా రిలీజ్‌డేట్‌ను అనౌన్స్ చేస్తూ ఓ ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో అఖిల్ లుక్ టెరిఫిక్‌గా ఉంది. విలన్ సాలే అని అఖిల్‌ను తిట్టడం, సాలే కాదు.. వైల్డ్ సాలే అని చెప్పుడు అంటూ తను రియాక్ట్ కావటం ఈ ప్రోమోలో గమనించవచ్చు. ప్రోమోలో అఖిల్ లుక్‌పై అందరూ సందిస్తున్నారు. ఈ క్రమంలో స్టార్ హీరోయిన్ సమంత రియాక్ట్ అయ్యింది.
‘బీస్ట్ మోడ్ ఆన్’ అంటూ అఖిల్ ప్రోమోపై సమంత రియాక్ట్ అయిన తీరు నెట్టింట వైరల్ అవుతుంది. ఆసక్తికరమైన విషయమేంటో తెలుసా! సమంత పుట్టినరోజునే అఖిల్ ఏజెంట్ మూవీ రిలీజ్ అవుతుంది. అఖిల్ అన్న నాగచైతన్యతో సమంత విడిపోయినప్పటికీ అఖిల్‌తో మంచి అనుబంధం ఉంది. సమంత మియోసైటిస్‌తో బాధ పడుతున్న క్రమంలో ఆమె త్వరగా కోలుకోవాలని అఖిల్ పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా అఖిల్ మూవీ ప్రోమోకి సమంత రియాక్ట్ అయ్యింది.
పాన్ ఇండియా మూవీగా అఖిల్ ఏజెంట్ రిలీజ్‌కి సిద్ధమవుతుంది. తెలుగు సహా హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లోనూ సినిమా విడుదలవుతుంది. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి ఇందులో కీలక పాత్రలో నటించారు. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్‌పై మూవీ రూపొందింది. గత ఏడాదిలోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాలతో వాయిదా పడింది. చివరకు ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతుందనుకుంటే.. పాన్ ఇండియా రేంజ్ రిలీజ్‌కు కావాల్సినంత సమయం లేకపోవటంతో మేకర్స్ ఏజెంట్‌ను ఏప్రిల్ 28కి రిలీజ్ చేయటానికి నిర్ణయించుకున్నారు.
ALSO READ:
97616209
ALSO READ:
Mahesh Babu సినిమా ఆడిషన్.. ఏడుస్తూ బయట కొచ్చేసిన హీరోయిన్.. తర్వాత ఏం చేసిందంటే!
ALSO READ:
Vani Jairam demise: వాణీ జయరాం ముఖంపై తీవ్ర గాయాలు.. మృతిపై అనుమానాలు
ALSO READ:
Thalapathy 67: దళపతి 67 టైటిల్ ప్రోమో రిలీజ్.. కత్తి పట్టుకున్న విజయ్
Read Latest
Tollywood updates and