హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసు ఎన్‌ఐఏకి బదిలీ

Hyderabad Blasts Case: హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ (NIA)కి బదిలీ అయింది. పేలుళ్ల కుట్రపై కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే జాహేద్ ముఠాను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులు జాహేద్, ఫారూఖ్, సమియొద్దీన్‌ చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.

దసరా సందర్భంగా పేలుళ్లకు కుట్ర..

దసరా సందర్భంగా జాహేద్ ముఠా హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర పన్నారు. ఈ ముఠా పాకిస్థాన్, నేపాల్ మీదుగా మనోహరాబాద్కు పేలుడు పదర్థాలు (హ్యాండ్ గ్రనేడ్లు) తరలించారు. అక్కడి నుంచి జాహేద్ అనుచరుడు వాటిని హైదరాబాద్కు తీసుకొచ్చాడు. దేశ అంతర్గత భద్రతకు భంగం కలిగించేలా నగరంలోని రద్దీ ప్రాంతాల్లో పేలుళ్లకు నిందితులు ప్లాన్ చేశారు. వీరి కుట్రను భగ్నం చేసిన పోలీసులు గతేడాది జాహేద్, సమియెద్దీన్, ఫారూఖ్‌లను అరెస్టు చేశారు. దసరా వేడుకల్లో ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ నేతలు టార్గెట్‌గా ఈ ముఠా పేళుళ్లకు ప్లా్న్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ దాడిలో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఓ హోంగార్డ్ ప్రాణాలు కోల్పోయాడు. సీపీ కార్యాలయం పేలుడు ఘటనలో జాహేద్ నిందితుడిగా ఉన్నాడు. ఆత్మాహుతి బాంబర్‌కు జాహేద్ ఆశ్రయం కల్పించినట్లు తేలింది. దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా జాహేద్‌ ఉగ్రమూకలతో సంబంధాలు కొనసాగించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో జాహెద్‌పై నిఘా ఉంచారు. హైదరాబాద్ పేలుళ్లకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు.. గతేడాది జాహెద్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఉగ్రకుట్ర విషయం తెలిసింది.

97595849

97616929

97617902

97540526

Read More Telangana News And Telugu News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *