Asia Cup 2023: ఆసియా కప్ పాక్ అవతలే

Asia Cup 2023: ఆసియా కప్ పాక్ అవతలే ఆసియా కప్ ను పాకిస్థాన్ నుంచి తరలించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) భావిస్తోంది. ఈ విషయంపై బహ్రెయిన్ లో శనివారం జరిగిన ఏసీసీ ఎమర్జెన్సీ మీటింగ్ లో బీసీసీఐ సెక్రటరీ జై షా, పీసీబీ చైర్మన్ నజామ్ సేథి చర్చించారు. సెప్టెంబర్ లో జరగాల్సిన ఈ టోర్నీ ఆతిథ్య హక్కులు పాక్ కు కేటాయించారు. కానీ, టీమిండియా ఈ టోర్నీ కోసం పాక్ వెళ్లబోదని జై షా గతేడాది ప్రకటించాడు. మార్చిలో జరిగే ఏసీబీ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మీటింగ్ లో టోర్నీ వేదికపై తుది నిర్ణయం రానుంది. టోర్నీ పాక్ లో జరగదని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. మెగా టోర్నీకి యూఏఈ ఆతిథ్యం ఇచ్చే చాన్స్ ఉంది. ప్రస్తుతం పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో ఉన్న కారణంగా యూఏఈలో ఆసియాకప్ నిర్వహిస్తే ప్రసార హక్కుల ద్వారా ఆదాయాన్ని పొందొచ్చని పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఆలోచిస్తోంది. 

©️ VIL Media Pvt Ltd.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *