Budget: తెలంగాణ బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం.. రూ. 3 లక్షల కోట్లతో పద్దు !

Telangana Budget: తెలంగాణ బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ ఉదయం సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం బడ్జెట్ ప్రతిపాదనలను చర్చించి ఆమోదించింది. దాదాపు రూ. 3 లక్షల కోట్లతో బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. రేపు (ఫిబ్రవరి 6న) ఆర్థిక మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇక శాసనమండలిలో సభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడతారు.

మరికొన్ని నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు ఉండటం, ముందస్తు ఎన్నికలు ఉహాగానాల నేపథ్యంలో తెలంగాణ బడ్జెట్ ఎలా ఉంటుందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ప్రజలను ఆకట్టుకునేందుకు పలు సంక్షేమ పథకాలకు భారీగా నిధులు కేటాయించే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దళితబంధు పథకానికి భారీగా కేటాయింపులు ఉండే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

అలాగే రైతు బంధు, ఉచిత విద్యుత్, ఖాళీ జాగా ఉండి ఇళ్లు నిర్మించుకునే పేదలకు రూ. 3 లక్షల ఆర్థిక సాయం వంటి పథకాలకు నిధులు వెచ్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. నిరుద్యోగ భృతి ఇస్తామని గత ఎన్నికల్లో కేసీఆర్ హామీ ఇచ్చి దానిని అమలు చేయకుండా నిరుద్యోగులను మోసం చేశారనే విమర్శలు ప్రతిపక్ష, విపక్ష పార్టీల నుంచి వినిపిస్తున్నాయి. దీంతో ఈ బడ్జెట్‌లో నిరుద్యోగుల భృతిపై కీలక ప్రకటన వెలువడవచ్చునని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

97617902

97595849

Read More Telangana News And Telugu News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *