Chinna Apps: బెట్టింగ్, లోన్ యాప్‌లపై కేంద్రం కొరడా.. ఒకేసారి 232 యాప్‌లు బ్యాన్

Chinna Apps: చైనాకు షాకిచ్చేలా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చైనా యాప్‌లపై మరోసారి కొరడా ఝుళిపించింది. ఏకంగా ఒకేసారి 232 చైనా యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్లు ఆదివారం కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్పర్మేషన్ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇందులో 138 బెట్టింగ్ యాప్‌లు, 98 లోన్ యాప్‌లు ఉన్నాయి. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ నుంచి ఆదేశాల ప్రకారం వీటిని బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది.

చైనా లింకులు కలిగి ఉన్నట్లు గుర్తించడంతో ఈ యాప్‌లపై అత్యవసర ప్రాతిపదికన నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ యాప్‌లతో దేశ భద్రతకు ప్రమాదం పొంచి ఉందని, గూఢచర్య సాధనాలుగా మారే అవకాశముందని తెలిపింది. అంతేకాకుండా ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టేసి దేశ ప్రజలకు తీవ్ర నష్టం చేకూర్చుతున్నాయని, వీటి వేధింపులతో ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని స్పష్టం చేసింది. దేశ ప్రజల సమాచారం విద్రోహశక్తులకు చేర్చే అవకాశముందని, ఈ యాప్స్ వల్ల దేశంపై నిఘా పెట్టే ప్రమాదముందని కేంద్రం పేర్కొంది.

దేశ భద్రత ముప్పు ఉన్నట్లు గుర్తించడంతో.. గత నాలుగు సంవత్సరాల్లో 250కిపైగా చైనా యాప్స్‌పై కేంద్రం నిషేధం విధించింది. టిక్ టాక్, పబ్జీ, Xender, గారెనా ఫ్రీ ఫైర్‌తో పాటు వినియోగదారుల డేటాను సేకరించే అనేక యాప్‌లపై కేంద్రం చర్యలు తీసుకుంది. మత విద్వేషాలకు, అల్లర్లకు ఈ యాప్స్ కారణం అవుతున్నాయని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన డిమాండ్ల మేరకు చైనా యాప్‌లపై కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఇలాంటి యాప్స్‌పై నిఘా పెట్టిన కేంద్రం.. విడతల వారీగా ప్రమాదకరమైన యాప్‌లను బ్యాన్ చేస్తూ వస్తోంది.

ఈ యాప్‌లు భారత్‌లో తమ ఉద్యోగులను నియమించుకుని సామాన్య, మధ్యతరగతి ప్రజలను టార్గెట్ చేసి యాప్‌ల ద్వారా లోన్లు మంజూరు చేసింది. డబ్బులకు అత్యధిక వడ్డీ వసూలు చేయడంతో పాటు.. తిరిగి చెల్లించకపోతే వేధింపులకు గురి చేస్తోంది. అసభ్యకరమైన మెస్సేజ్‌లు పెట్టడం, మార్పింగ్ చేసిన ఫొటోలను విడుదల చేసి బెదిరించడం, వారి ఫొటోలను ఇతరులకు పంపించి అవమానాలకు గురి చేయడం లాంటి చేస్తూ ఉంటాయి. అలాగే బెట్టింగ్ యాప్‌లకు అలవాటు అయి ఎంతోమంది తమ డబ్బులను పొగోట్టుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *