Gold rate: ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర

Gold rate: ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గాయి. దేశీయ మార్కెట్లలో 10 గ్రాముల ధర శనివారం రూ.56,560 వద్ద ముగిసింది. ఇది దాని కొత్త గరిష్ట ధర రూ.58,847 నుండి దాదాపు రూ.2,300 తక్కువ. గడిచిన పది నెలల్లో ఇదే అత్యంత తక్కువ ధర. యూఎస్ ఫెడ్ పాటు చాలా యూరోపియన్ సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపుకు మొగ్గుచూపడం, యూఎస్ డాలర్ రేట్ల 10నెలల కనిష్ట స్థాయికి పడిపోవడంతో పరీడికి డిమాండ్ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ లోనూ బంగారం ధరలు భారీగా తగ్గు ముఖం పట్టాయి. స్పాట్ బంగారం ధర శుక్రవారం ఔన్సుకు 1,864 డాలర్ల వద్ద ముగిసింది. వారంలో దాదాపు 3.23 శాతం నష్టపోయింది. 

జీవితకాల గరిష్ఠ స్థాయిల నుండి బంగారం ధర తగ్గడానికి గల కారణాలపై మార్కెట్ ఎక్స్ పర్టులు సుగంధ సచ్ దేవా మాట్లాడుతూ. ‘ఈ సంవత్సరం మొదటి పాలసీ సమావేశంలో, యూఎస్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇది ధరల ఒత్తిడిని తగ్గించనుంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బ్యాంక్ ఆఫ్ యూరప్ కూడా రేట్ల తగ్గింపునకే మొగ్గుచూపాయి. దీంతో యూఎస్ డాలర్లు మార్కెట్లోకి భారీగా వచ్చాయి. అందుకే దీని విలువ పది నెలల కనిష్ట స్థాయికి పడింది. యూఎస్ లేబర్ మార్కెట్ బాగుంది. నాన్ ఫార్మ్ జాబ్స్ 517,000 పెరిగాయి. నిరుద్యోగం రేటు 34 శాతానికి పడి పోయింది జీతాలు పెరిగాయి. దీంతో డాలర్ ఇండెక్స్ బలపడింది. బంగారం ధరలు పడిపో యాయి’అని ఆమె వివరించారు. స్వస్తిక ఇన్వెస్ట్ మెంట్లో సీనియర్ కమోడిటీ రీసెర్చ్ ఎనలిస్ట్. నృపేంద్ర యాదవ్ మాట్లాడుతూ ధరల తగ్గుదల తాత్కాలికమేనని అన్నారు. తరచూ వడ్డీరేట్లను పెంచడంవల్ల గ్లోబల్ ఎకానమీ పై ఒత్తిడి ఉందని, కొంతకాలం తరువాత బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని అన్నారు.

©️ VIL Media Pvt Ltd.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *