Green Tea: గ్రీన్ టీలో వీటిని కలిపి తాగితే… క్యాన్సర్ తో సహా చాలా వ్యాధులు దూరం..

Benefits of Drinking Green Tea: పాలు, పంచదార, టీ ఆకులతో చేసిన టీ కంటే గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ హెర్బల్ టీని తాగడం వల్ల బరువు తగ్గుతారు. అయితే ఈ గ్రీన్ టీలో కొన్ని ప్రత్యేకమైన వాటిని జోడిస్తే దీని యెుక్క  ప్రయోజనాలు పెరుగుతాయి. అవేంటో తెలుసుకుందాం. 

గ్రీన్ టీ ప్రయోజనాలు

1. అల్లం

వంటకాల్లో అల్లంను మసాలా దినుసుగా వాడుతుంటాం. ఇది వేయగానే దాని రుచి రుచి పెరుగుతుంది. అయితే గ్రీన్ టీలో  దీనిని కలిపి తాగితే ఎన్నో ఆరోగ్యకర ప్రయోనాలు ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను రాకుండా అడ్డుకుంటుంది. 

2. పుదీనా ఆకులు మరియు దాల్చిన చెక్క

కొంతమంది గ్రీన్ టీలో పుదీనా ఆకులు మరియు దాల్చిన చెక్కను కలుపుకుని  తాగుతారు. ఎందుకంటే ఇది మీ ఇమ్యూనిటీ పెంచడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది తాగినా చాలాసేపు వరకు ఆకలి వేయదు. కాబట్టి మీరు బరువు  కూడా తగ్గుతారు. 

3. నిమ్మకాయ

నిమ్మకాయను గ్రీన్ టీలో కలిపి తీసుకుంటే రుచి కొద్దిగా మారుతుంది. ఈ రెండు కాంబినేషన్ మీ శరీరానికి మేలు చేస్తుంది. యాంటీఆక్సిడెంట్లను పెంచడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. 

4. స్టీవియా ఆకులు

స్టీవియాను తెలుగులో ‘మధుపత్రి’ అని అంటారు. ఇది గ్రీన్ టీతో కలిపితే తీపి యాడ్ అవుతుంది. దీన్ని రెగ్యులర్‌గా తీసుకుంటే క్యాలరీలు తగ్గడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయి కూడా తగ్గుతుంది. ఇది డయాబెటిక్ పేషెంట్లుకు చాలా బాగా ఉపయోగపడుతుంది.  

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: World Cancer Day: బ్రెస్ట్ కేన్సర్ నుంచి రక్షించే 5 ఆహార పదార్ధాలివే 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ –  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ –  https://apple.co/3loQYe 

Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *