IND Vs AUS: ఆసీస్ జట్టుకు మరో ఎదురుదెబ్బ.. మొదటి టెస్ట్‌ నుంచి హేజిల్‌వుడ్ ఔట్

Josh Hazlewood Ruled out of Nagpur Test: భారత్-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌కు ముందు ఆటగాళ్ల గాయాలు రెండు జట్లను భయపెడుతున్నాయి. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్, టీమిండియా బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ ఇప్పటికే అవుట్ అయ్యారు. రీసెంట్‌గా ఆల్ రౌండర్ కెమరూన్ గ్రీన్ కూడా తొలి మ్యాచ్‌లో ఆడటం కష్టంగా మారింది. తాజాగా ఆసీస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మరో ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ మొదటి మ్యాచ్‌కు దూరమయ్యాడు. హేజిల్‌వుడ్ అకిలెస్ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. గత నెలలో బౌలింగ్ చేస్తున్న సమయంలో ఎడమ కాలికి ఈ గాయమైంది.  

నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్‌లో జరగనుంది. ఆదివారం బెంగళూరులోని KSCA స్టేడియంలో జోష్ హేజిల్‌వుడ్ మాట్లాడాడు. ‘మొదటి టెస్టు గురించి ఖచ్చితంగా తెలియదు. ఇంకా కొన్ని రోజుల సమయం ఉంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి తక్కువ సమయం ఉంది. రెండో టెస్టు కాస్త ఆలస్యంగా జరగనుంది. మంగళవారం నేను ప్రాక్టీస్ చేస్తా. అప్పటికీ గాయం నయం అవుతుందని ఆశిస్తున్నా..’ అని చెప్పాడు. తొలి టెస్టులో హేజిల్‌వుడ్ స్థానంలో స్కాట్ బోలాండ్ తుదిజట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరి 17 నుంచి ఢిల్లీలో జరగనున్న రెండో టెస్టుకు కూడా హేజిల్‌వుడ్ కోలుకోవడం అనుమానంగానే ఉంది.  

 

దక్షిణాఫ్రికాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టు తొలి రోజు క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించిన స్టార్క్ ఎడమ చేతి వేలికి గాయమైంది. ఈ గాయం నుంచి అతడు ఇంకా కోలుకోలేదు. అదేసమయంలో కామెరాన్ గ్రీన్ కూడా తన గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్‌ సందర్భంగా వేలికి గాయమైంది. తాజాగా హేజిల్‌వుడ్ కూడా దూరమవ్వడం ఆసీస్ జట్టును కలవరపెడుతోంది.   

ఆస్ట్రేలియా టెస్టు జట్టు: పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుస్‌చాగ్నే, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, టాడ్ మర్ఫీ, మాట్ రెన్‌షా, పీటర్ హ్యాండ్‌స్కాంబ్, లాన్స్ మోరిస్, అష్టన్ అగర్ , మిచెల్ స్వెప్సన్, నాథన్ లియోన్, జోష్ హాజిల్‌వుడ్, స్కాట్ బోలాండ్.

గమనిక: గాయం కారణంగా మిచెల్ స్టార్క్ తొలి టెస్టులో పాల్గొనడం లేదు. ఇప్పుడు జోష్ హేజిల్‌వుడ్ తొలి టెస్టుకు దూరమయ్యాడు. కామెరాన్ గ్రీన్ కూడా ఇంకా ఫిట్‌గా ఉన్నట్లు ప్రకటించలేదు.

Also Read: IND Vs AUS: ఆసీస్-భారత్ టెస్ట్ సిరీస్.. ఈ ఐదుగురు ఆటగాళ్లపై ఓ లుక్కేయండి   

Also Read: Pervez Musharraf: బిగ్ బ్రేకింగ్.. పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌ కన్నుమూత  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ –  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ –  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *