KTR: రైతుబంధు పరిమితి..అసెంబ్లీలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ అసెంబ్లీలో రెండో రోజు సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. మొదట మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసి శాసనసభలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. ఈ క్రమంలో కేటీఆర్ కల్పించుకొని కౌంటర్ ఇచ్చారు. ఇక శాసనమండలిలో 24 గంటల కరెంటుపై బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మధ్య వాగ్వాదం నెలకొంది. ఇక తాజాగా అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన, సంక్షేమ పథకాలపై ప్రశంసలు కురిపించారు. ఇక రైతుబంధు పరిమితిపై ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతంపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

రైతుబంధు పరిమితిపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..

‘రైతుబంధు పరిమితిపై ప్రతిపక్షాలు పనికిమాలిన రాద్ధాంతం చేస్తున్నాయి. వందల ఎకరాలు ఉన్న వారికీ రైతుబంధు ఎందుకని అంటున్నారు. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే..రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయంగా అందిస్తున్న రైతుబందులో 98.16 శాతం చిన్న, సన్న కారు రైతులకు అందుతుందని, మిగిలిన శాతం మాత్రమే మిగతా వారికి వెళ్తుందన్నారు. రాష్ట్రంలో సీలింగ్ చట్టం ఉంది. ఈ పథకం ద్వారా బీసీ, ఎస్సి, ఎస్టీలకు అధిక మేలు జరుగుతుందని’ మంత్రి కేటీఆర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *