Nizamabad జిల్లాలో భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు పెట్టిన జనం

Nizamabad: నిజామాబాద్‌లో ఆదివారం భూప్రకంపనలు సంభవించాయి. నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కూల్‌పై 3.1గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. భూమి ఒక్కసారిగా కంపించడంతో.. భయంతో ఇళ్లల్లోని ప్రజలు బయటకు పరుగులు పెట్టారు. నిజామాబాద్‌కి 120 కిలోమీటర్ల దూరంలో, ఐదు కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైనట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

మహారాష్ట్రలోని నాందేడ్‌కు సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు గుర్తించారు. ఆదివారం ఉదయం 8.12 గంటల ప్రాంతంలో భూకంపం వచ్చినట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టింది. అయితే నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో భూకంపం సంభవించడం ఇది తొలిసారి కాదు. గతంలోనూ అనేకసార్లు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

అయితే తాజాగా సంభవించిన భూప్రకంపనల్లో ఎలాంటి ప్రమాదాలు జరగలేదని అధికారులు చెబుతున్నారు. ఎలాంటి నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. స్పల్పంగానే భూమి కంపించడంతో ప్రమాదం తప్పిందని అంటున్నారు. కాగా తెలంగాణలో భూప్రకంపనలు ఇటీవల ఎక్కువగా నమోదవుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ 6న జహీరాబాద్ మండలం బిలాపూర్‌లో భూమి కంపించింది. ఇక 2021 అక్టోబర్ 21న మంచిర్యాల, కరీంనగర్, రామగుండంలో భూప్రకంపనలు సంభవించగా.. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.0గా నమోదైంది. అలాగే 2022 అక్టోబర్ 15న ఆదిలాబాద్ జిల్లాలో, 2021 నవంబర్ 1న కుమురంభీమ్, మంచిర్యాల జిల్లాల్లో భూమి కంపించింది.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *