ORR Road Accident: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓఆర్‌ఆర్‌పై ఘటన జరిగింది. ఓ బెంజ్ కారు (AP 09 BU 0990) అదుపు తప్పి డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న టాటా విస్టా కారు (TS 05 UC 4666)ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు.
మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడగా.. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందుతోంది. ఉహించని ప్రమాదంతో మృతుల కుుటంబాల్లో విషాదం అలుముకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రోడ్డుపై ట్రాఫిక్ జామ్ కాగా.. క్లియర్ చేసి వాహన రాకపోకలు పునరుద్ధరించారు. కాగా.. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
97616929
97595849
Read More Telangana News And Telugu News