Pawan Kalyan Unstoppable Promo: ఇక సినిమాలకు పవన్ గుడ్‌ బై..? అన్‌స్టాపబుల్ ప్రోమోలో అదే హైలెట్ పాయింట్

Unstoppable With NBK Pawan Kalyan Promo: అటు నందమూరి అభిమానులు.. ఇటు పవర్ స్టార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షో లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. బాలకృష్ట హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోకు పవన్ కళ్యాణ్ గెస్ట్‌గా వెళ్లిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆహాలో పార్ట్-1 స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇప్పటికే అన్ని రికార్డులను బద్దలు కొట్టేసి దూసుకుపోతుంది. బాలయ్య ఘాటనై ప్రశ్నలు.. పవన్ దీటైన సమాధానాలతో పార్ట్-1 ఫుల్ హీటెక్కించింది. తాజాగా పార్ట్‌-2కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో పవన్ పొలికటిల్ జీవితానికి సంబంధించిన ప్రశ్నలను ఎక్కవగా అడిగారు బాలకృష్ణ.  

పవన్ కళ్యాణ్ జేబులో చేతులు పెట్టుకోవడంపై బాలయ్య సరదాగా మాట్లాడారు. ఎవరినీ కొట్టకుండా ఆపుకునేందుకు జేబులో చేతులు పెట్టుకున్నావేమోనని తనకు అనిపిస్తుందని అనగా.. పవన్ ఒక్కసారిగా గట్టిగా నవ్వేశారు. ఇక ఇటీవల పవన్ కారు టాప్‌పై కూర్చొని ప్రయాణించగా విమర్శలు వచ్చాయి. ఈ ఫొటోను చూపిస్తూ ఏంటి గొడవ అని అడిగారు. ‘కారులో వెళ్లకూడదు.. కారులో నుంచి బయటక రాకూడదు.. రూమ్‌లో ఉండకూడదు.. రూమ్‌లో నుంచి బయటకు రాకూడదంటే చాలా కాలం తరువాత కొంచెం తిక్క వచ్చింది. అధికార యంత్రాంగం కూడా మరీ హద్దులు దాటేసి ప్రవర్తిస్తోంది..’ అంటూ పవన్ సమాధానమిచ్చారు.  

ఎందుకు పార్టీ స్థాపించాల్సి వచ్చిందని బాలకృష్ట ప్రశ్నించగా.. పవన్ కళ్యాణ్ సీరియస్‌గా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘ఎంతసేపు మనం ప్రాథమిక హక్కులు గురించి మాట్లాడుతాం కానీ.. ప్రాథమిక బాధ్యతల గురించి మాట్లాడం..’ అని పవన్ అన్నారు. మీ మేనిఫెస్టో పూర్తిగా జనాల్లోకి వెళ్లకపోవడమేమో అంటూ బాలయ్య ప్రశ్నలు వేశారు. రాష్ట్రంలో నీకు ఫ్యాన్ కానటువంటి వారెవరూ లేరు.. మరి ఆ ప్రేమ ఓటుగా ఎందుకు మారలేదని అడిగారు. ఎవరైనా ఎదుగుతూ ఉంటే.. వారిని ఎదగనీయకుండా చేయడం వ్యూహంలో ఒక భాగం అంటూ పవన్ అన్నారు.

ఆ తరువాత షో మధ్య ఓ బామ్మ వచ్చి తన జీవిత కష్టాలు చెప్పడంతో అందరూ ఎమోషనల్ అయ్యారు. తన ఇద్దరు కొడుకులు కరోనాతో చనిపోయారని.. ప్రస్తుతం తనకు ఒక కొడుకే ఉన్నాడని.. ఆ కొడుకే పవన్ కళ్యాణ్ అని అన్నారు. పవన్ కళ్యాణ్‌ సీఎం అయిన తరువాత అప్పుడు చనిపోతాను తాను అని అన్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ ఆమె కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. 

ప్రోమో చివర్లో డైరెక్టర్ క్రిష్ సందడి చేశారు. మా ఇద్దరితో పనిచేశావు కదా.. డిఫరెన్స్ ఏంటి..? అని బాలకృష్ట ప్రశ్నించగా.. ఒక సింహం, ఒక పులి మధ్యలో నా తల ఉందంటూ సమాధానం ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ సినిమాలు మానేసి.. ప్రజా సేవకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని బాలయ్య అడగ్గా.. ఆడియన్స్ నుంచి ఎక్కువ శాతం ఎస్ అని సమాధానం వచ్చింది. ఆడియన్స్‌లో కూర్చుకున్న డైరెక్టర్ క్రిష్ కూడా యస్ అని గట్టిగా అరిచాడు. పార్ట్-2 ఎపిసోడ్ ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ప్రోమోపై మీరూ ఓ లుక్కేయండి.

Also Read: Former CM Siddaramaiah: ఇవే నాకు చివరి ఎన్నికలు.. మాజీ ముఖ్యమంత్రి సంచలన ప్రకటన  

Also Read: Indian Railway Facts: ఇంజిన్‌ను చూసి ట్రైన్ గుర్తుపట్టడం ఎలా..? ఈ సింపుల్ ట్రిక్స్ తెలుసుకోండి  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ –  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ –  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *