Short Term Courses: మూడు సంవత్సరాల గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడానికి మీకు సమయం ఉండటం లేదా. లేకపోతే.. మీకు ఈ కోర్సు(Course) చేయడానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇక్కడ చెప్పే కోర్సుల ద్వారా మీరు ఈ లోటును పూరించవచ్చు. నేటి కాలంలో.. ఇలాంటి షార్ట్‌టర్మ్ కోర్సులు(Short Term Courses) చాలా డిమాండ్ ఏర్పడింది. వీటిని పూర్తి చేసిన తర్వాత వారికి అత్యధిక వేతనంతో ప్యాకేజీలు ఇవ్వబడతాయి. వీటితో పాటు.. మీరు సొంత స్టార్టప్‌ను(Startup) కూడా ప్రారంభించవచ్చు. అలాంటి షార్ట్ టర్మ్ కోర్సుల జాబితాను ఇక్కడ ఇవ్వడమైనది. పూర్తి వివరాలు తెలుసుకోండి.
వెబ్ డిజైనింగ్(Web Designing)
ఈరోజుల్లో వెబ్ డిజైనింగ్ క్రేజ్ అధికంగా ఉంది. 12వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల నుంచి గ్రాడ్యుయేట్ పాస్ అభ్యర్థుల వరకు ఎవరైనా ఈ కోర్సు చేయవచ్చు. ఈ కోర్సు వ్యవధి 03 నెలల నుండి 09 నెలల మధ్య ఉంటుంది. ఈ కోర్సు చేసిన తర్వాత.. మీరు వెబ్ డిజైనర్‌గా ఉద్యోగం పొందవచ్చు. లేదా మీరు సొంత వ్యాపారాన్ని కూడా ప్రారంభించవచ్చు. భారతదేశంలో వెబ్ డిజైనర్ యొక్క ప్రారంభ వేతనం రూ.20 నుండి రూ.25 వేల మధ్య ఉంటుంది. దీనిలో మీకు అనుభవంతో శాలరీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది.
యానిమేషన్(Animation)
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అన్ని చోట్లా యానిమేషన్ క్రేజ్ వేగంగా పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు యానిమేషన్‌లో షార్ట్‌టర్మ్ కోర్సులు చేయడం ద్వారా మంచి ఉద్యోగం పొందవచ్చు. ప్రధానంగా యానిమేటర్ వీడియో పరిశ్రమ, గేమ్, ప్రత్యేక డిజైన్ కంపెనీలలో ఈ కోర్సు చేసిన వాళ్లు అర్హులుగా ఉంటారు. అంతే కాకుండా.. మీరు సొంత స్టార్టప్‌ను కూడా ప్రారంభించవచ్చు. భారతదేశంలో యానిమేటర్ యొక్క ప్రారంభ జీతం దాదాపు రూ. 22 వేల నుండి రూ. 30 వేల వరకు ఉంటుంది. దీనికి కూడా అనుభవం ఆధారంగా వేతనం పెరుగుతూ ఉంటుంది. భవిష్యత్ లో రూ.లక్ష వరకు కూడా జీతం తీసుకునే అవకాశం ఉంటుంది.
TSPSC Alert: టీఎస్పీఎస్సీ అలర్ట్.. ఫిబ్రవరి 06 సాయంత్రం 5 గంటల వరకు ఛాన్స్..
ఫ్యాషన్ డిజైనింగ్(Fashion Designing)
మీకు ఫ్యాషన్‌పై ఆసక్తి ఉంటే.. మీరు ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో గొప్ప కెరీర్ ప్రారంభించవచ్చు. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో.. విద్యార్థులకు ఫ్యాషన్ పరిశ్రమతో పాటు డిజైనింగ్ పద్ధతులు, సాంకేతికత గురించి సమాచారం ఇవ్వబడుతుంది. ఫ్యాషన్ డిజైనర్ ప్రారంభ వేతనం దాదాపు రూ.18,000. ఈ కోర్సు స్వల్పకాలిక మరియు దీర్ఘకాలికమైనది. ఫ్యాషన్ డిజైనింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ , మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్‌లను కూడా చాలా ఇన్‌స్టిట్యూట్‌లు అందిస్తున్నాయి.