Three Month Old Child Deid: చిన్నారి శరీరంపై 51 వాతలు.. నాటు వైద్యానికి పసిబిడ్డ బలి

Madhya Pradesh Child Deid: మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నాటు వైద్యాన్ని నమ్ముకుని తమ పసి బిడ్డ ప్రాణాలు తీసుకున్నారు తల్లిదండ్రులు. అసలే నిమోనియాతో బాధపడుతున్న పసికందు శరీరంపై 51 వాతలు పెట్టారు. తీరా అంతా అయిపోయాక ఆసుపత్రికి వెళ్లగా.. చిన్నారి ప్రాణాలు విడిచింది. 

Madhya Pradesh Child Deid: చీమ కరిస్తేనే అల్లాడిపోతున్న ఈ రోజుల్లో 51 వాతలు పెట్టి  పసిబిడ్డ ప్రాణం తీశారు తల్లిదండ్రులు. టెక్నాలజీ ఇంతకింత అభివృద్ధి చెందుతున్న రోజుల్లోనూ..  వాతపెడితేనే వ్యాధి తగ్గుతుందంటూ చాలా మంది నాటు వైద్యానికే మొగ్గు చూపుతూ పసిపిల్లల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. గిరిజన ప్రాబల్యం ఎక్కువగా ఉన్న మధ్యప్రదేశ్‌ షాదోల్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

 

నిండా 90 రోజులు నిండని పసికందు రుచిత అనే చిన్నారి కోల్డ్, నిమోనియా బారిన పడింది. గిరిజన ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతం కావడంతో బిడ్డ తల్లిదండ్రులు పాపని ఆసుపత్రికి కాకుండా  నాటు వైద్యుడి దగ్గరకు తీసుకుని వెళ్లారు. వాతలు పెడితే వ్యాధి నయం నయమవుతుందని నాటు వైద్యుడి సూచించాడు. ముట్టుకుంటే కందిపోయే పసిబిడ్డ లేత శరీరంపై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 51 వాతలు పెట్టారు తల్లిదండ్రులు. అసలే నిమోనియాతో బాధపడుతూ శ్వాస తీసుకోలేకపోతున్న పసికందుకు వాతలు పెట్టడంతో పాప ఆరోగ్యం మరింత విషమించింది.

దీంతో భయపడిపోయిన తల్లిదండ్రులు  సమీప ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే వాతలు పెట్టి  15 రోజులు కావడంతో సరైన సమయానికి వైద్యం అందక ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ వ్యాపించి పసి బిడ్డ మృతి చెందింది. తర్జనభర్జనలు పడుతూ హడావుడిగా పాప అంత్యక్రియలు పూర్తిచేశారు తల్లితండ్రులు. శుక్రవారం మహిళా సంక్షేమ శాఖ అధికారులు  ఆసుపత్రికి వెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పాప మృతదేహాన్ని వెలికి తీసి శనివారం పోస్టుమార్టం నిర్వహించారు. అంగన్‌వాడీ కార్యకర్త వాతలు పెట్టించొద్దని మొత్తుకున్నా.. ఆ తల్లిదండ్రులు పట్టించుకోలేదని సమాచారం. 

ఈ ఘటనపై బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ  బీజేపీ నేతలు సైతం ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్‌ను కోరారు. ఇలాంటి చికిత్సలపై వివరాలు తెలుసుకుని వారిని కఠినంగా శిక్షిస్తామని షాదోల్ జిల్లా కలెక్టర్ తెలిపారు. గిరిజిన ప్రాబల్యం ఉన్న ఈ ప్రాంతంలో ఇలాంటి చికిత్సలు సర్వసాధారణం అయ్యాయని అన్నారు. ప్రజలు నాటు వైద్యాన్ని నమ్ముకోకుండా.. ఆసుపత్రికి వెళ్లాలని ఆయన సూచించారు. 

Also Read: PM Kisan: రైతుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు.. నెరవేరని ఆశలు  

Also Read: Pakistan: పాకిస్థాన్‌లో వికీపీడియాపై బ్యాన్.. కారణం ఇదే..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ –  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ –  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *