US Visa Rules: యూఎస్ వీసా అపాయింట్‌మెంట్ లభించకపోతే ఆందోళన వద్దు, ఇలా చేస్తే వెంటనే వీసా

ఇక నుంచి యూఎస్ వీసా అపాయింట్‌మెంట్ దొరకకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అమెరికా విదేశాంగ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. నేరుగా యూఎస్ ఎంబసీకు వెళ్లి అపాయింట్‌మెంట్ తీసుకునే అవకాశం కల్పిస్తోంది. ఎలాగంటే..

అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లి చదువుకోవాలని చాలామందికి ఉంటుంది. అపాయింట్‌మెంట్‌కే నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. అంతా పూర్తయి వీసా చేతికి అందేందుకు ఇంకా సమయం పట్టేస్తుంటుంది. చాలా సందర్భాల్లో ఏడాదిన్నర పైగా పడుతుంది. ఇలాంటి సమస్యల్ని ఎదుర్కొనే విద్యార్ధుల సౌకర్యార్ధం యూఎస్ ఎంబసీ కీలక ప్రకటన చేసింది. ఇక నుంచి విదేశాలకు వెళ్లాలనుకుంటే..నేరుగా యూఎస్ ఎంబసీ లేదా కాన్సులేట్ జనరల్ వద్ద అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. థాయ్‌లాండ్‌లో ఉండే భారతీయులు బీ1, బీ2 వీసా అపాయింట్‌మెంట్ కూడా అక్కడే తీసుకోవచ్చని ఇండియాలోని యూఎస్ ఎంబసీ ట్వీట్ చేసింది.

వీసా జారీ ప్రక్రియ ఆలస్యం కాకుండా ఉండేందుకు అమెరికా ప్రత్యేక చర్యలు చేపట్టింది. వీసా కోసం తొలిసారి దరఖాస్తు చేసుకున్నవారికి ప్రత్యేక ఇంటర్వ్యూలు నిర్వహించడమే కాకుండా…కాన్సులేట్‌లో సిబ్బందిని పెంచుతోంది. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కత్తా, హైదరాబాద్‌లోని యూఎస్ ఎంబసీల్లో ఈ ఏడాది జనవరి 21వ తేదీ ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇప్పటికే ఏర్పాటయ్యాయి. రిమోట్ విధానంలో కూడా దరఖాస్తులు స్వీకరిస్తోంది. 2 వారాల క్రితం 2.5 లక్షల బీ1, బీ2 అపాయింట్‌మెంట్స్ జారీ చేసింది. 

అదే సమయంలో వీసా ఛార్జీలను కూడా అమెరికా భారీగా పెంచింది. హెచ్ 1బి వీసాలతో పాటు కొన్ని ఇతర వీసాలపై 200 శాతం ఛార్జీల్ని పెంచింది. హెచ్ 1బి వీసా ప్రీ రిజిస్ట్రేషన్ ఫీజును 10 డాలర్ల నుంచి ఏకంగా 1385 డాలర్లు చేసింది. స్కిల్ ఆధారిత ఉద్యోగాలకిచ్చే 0 కేటగరీ వీసాలకు 129 శాతం ఫీజు పెంచింది. ఇన్వెస్టర్లు, వ్యాపారవేత్తలకు జారీ చేసే ఈబి-5 వీసా ఛార్జీలు 3675 డాలర్ల నుంచి 11160 డాలర్లైంది. అంటే ఏకంగా 204 శాతం పెరిగింది. 

Also read: DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, త్వరలో మరోసారి డీఏ పెంపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link – https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link – https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *