(సంతోష్,న్యూస్ 18 తెలుగు, వరంగల్)
ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. హనుమకొండలోని లస్కర్ బజార్ ప్రభుత్వ పాఠశాలను మన ఊరు మనబడి పథకం కిందలక్షల రూపాయలతో అభివృద్ధి చేసిన పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యారంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా అనేక సంక్షేమ పథకాలను చేపడుతున్నారని అన్నారు.
- Peddapalli: అద్దెకి కాస్ట్యూమ్స్, విగ్గులు.. ఐడియా అదిరింది.. ఆదాయం పెరిగింది
ప్రతి గ్రామంలో గ్రామపంచాయతీలో కార్యాలయాలు, స్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు, సిసి రోడ్లు నిర్మిస్తూ అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు వినయ్ భాస్కర్. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి.. మంచి వాతావరణాన్ని కల్పిస్తూ.. పేదవాడు నాణ్యమైన చదువును చదవాలని లక్ష్యంతో మన ఊరు మనబడి పథకాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు.
- Ponguelti Srinivas Reddy: వైఎస్సార్టీపీ గూటికి పొంగులేటి..? విజయమ్మతో కీలక భేటీ..
పాఠశాలలు అభివృద్ధి చేస్తున్నప్పటికీ విద్యార్థుల సంఖ్య పెరగడం లేదని.. దీనికి విద్యార్థులు హాజరు పెంచేందుకు గ్రామస్థాయి నుండి నగర స్థాయి వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని కోరారు. ప్రభుత్వం పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చేయడంతో విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత కలిగిన విద్యను అందించేందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని, ఇందుకు విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పలువురు ఉపాధ్యాయులు అన్నారు. నిరుపేద విద్యార్థులకు ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి ఇదొక మంచి అవకాశం అని.. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులు కోరారు.