అఖిల్‌కు ఏజెంట్‌ కష్టాలు.. రూ. 3 కోట్ల యాక్షన్ సీక్వెన్స్ బూడిద పాలేనా?

స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి (Surender Reddy), యంగ్ హీరో అక్కినేని అఖిల్ (Akkineni Akhil) కాంబినేషన్‌లో రూపొందిన మూవీ ‘ఏజెంట్’ (Agent). మేకోవర్ పరంగా అఖిల్ తన బెస్ట్ ఇవ్వగా.. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, లుక్ వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ స్పై థ్రిల్లర్‌లో భారీ యాక్షన్స్ సీన్స్ పక్కా అని తెలుస్తోంది. ఇక సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం జనవరి 26న విడుదలవుతుందని గతంలో ప్రకటించినా వాయిదా పడింది. అయితే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ తాజాగా వదిలిన ప్రోమోలో అఖిల్ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇదే వీడియోపై సమంత ‘బీస్ట్ మోడ్ ఆన్’ అంటూ కామెంట్ చేసింది. ఇదంతా బాగానే ఉన్నా.. షూటింగ్ ఇంకా పూర్తవలేదనే టాక్ ఫ్యాన్స్‌కు షాక్ ఇస్తోంది.

‘ఏజెంట్’ మూవీని ఏప్రిల్ 28 విడుదల చేస్తున్నట్లుగా ప్రోమో విడుదల చేశారు మేకర్స్. కానీ షూటింగ్ పార్ట్ ఇంకా మిగిలే ఉందనేది తాజాగా తెలుస్తున్న సమాచారం. మిగిలిన షూటింగ్ కంప్లీట్ చేసేందుకు అఖిల్, సురేందర్ రెడ్డితో పాటు ఇతర టీమ్ సభ్యులు ఇప్పుడు అరేబియాలోని మస్కట్ వెళ్తున్నారని తెలుస్తోంది. అక్కడే 15 రోజుల పాటు హెవీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించనున్నట్లు నివేదికలు అందుతున్నాయి. నిజానికి గతంలో చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్ సురేందర్ రెడ్డిని ఆకట్టుకోకపోవడంతో ఆ సీక్వెన్స్‌ మొత్తం క్యాన్సిల్ చేశారనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. పైగా ఈ కొత్త యాక్షన్ సీక్వెన్స్‌ కోసం దాదాపు రూ. 3 కోట్లు ఖర్చు చేయనున్నారనే రూమర్స్ హల్ చల్ చేస్తు్న్నాయి. ఇదే నిజమైతే గతంలో తీసిన యాక్షన్ సీన్ వృథా అయినట్లేనని, ఇప్పుడు అదనంగా మూడు కోట్లు కావలసిందేనని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.

అయితే అఖిల్ ‘ఏజెంట్’ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. దీంతో భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది గనుక హిట్ అయితే అఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌‌గా నిలిచిపోతుంది. ఇక సురేందర్ రెడ్డి మ్యాజికల్ స్క్రీన్‌ప్లే, యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ ఈ సినిమాకు ప్లస్ కానుందని అభిమానులు అంచనా వేసుకుంటున్నారు.

ఈ చిత్రం తెలుగు స‌హా హిందీ, క‌న్నడ, మ‌ల‌యాళ‌, త‌మిళ భాష‌ల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. పైగా మలయాళ సూప‌ర్‌స్టార్ మ‌మ్ముట్టి ఇందులో కీల‌క పాత్రలో న‌టించడం ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, సురేంద‌ర్ 2 సినిమా బ్యానర్స్‌పై నిర్మించబడిన ఈ చిత్రానికి హిపాప్ తమీజా మ్యూజిక్ అందించారు.

Read Latest

Tollywood updates and

Telugu news

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *