అదానీ స్టాక్స్ లోయర్‌సర్క్యూట్.. కానీ ఈ షేర్లు మాత్రం అడ్డులేకుండా దూసుకెళ్తున్నాయ్!

Breakout Stocks: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలను నష్టాలు వెంటాడుతున్నాయి. క్రితం సెషన్‌లో భారీ లాభాల్లో ముగిసిన సూచీలు ఇవాళ తీవ్ర ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 400 పాయింట్లకుపైగా నష్టంతో 60 వేల 400 మార్కు వద్ద కదలాడుతోంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 130 పాయింట్లు కోల్పోయి.. 17 వేల 700 మార్కు వద్ద ట్రేడవుతోంది. ఐటీ, పవర్, రియాల్టీ షేర్లు భారీగా పడిపోతున్నాయి. ప్రస్తుతం ఇండస్‌ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, హీరో మోటోకార్ప్, ఐటీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ రాణిస్తుండగా.. అదానీ ఎంటర్‌ప్రైజెస్, దివీస్ ల్యాబ్స్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐషర్ మోటార్స్ డీలాపడ్డాయి.

అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. మరోవైపు అమెరికా స్టాక్ మార్కెట్ సూచీలు కూడా క్రితం అంటే శుక్రవారం సెషన్‌లో నష్టాలను నమోదు చేశాయి. ఇంకా అక్కడ నిరుద్యోగిత రేటు రెండేళ్ల కనిష్టానికి పడిపోయింది. ఇది ఫెడ్ వడ్డీ రేట్ల విషయంలో కఠినంగా వ్యవహరించే దిశగా నడిపించనుంది. నాస్‌డాక్ కాంపోజిట్ సూచీ 1.6 శాతం పడిపోగా.. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.38 శాతం నష్టపోయింది. S&P 500.. 1.04 శాతం నష్టాన్ని నమోదు చేసింది.

ఈపీఎఫ్ కొత్త రూల్‌తో గుడ్‌న్యూస్.. బడ్జెట్‌లో ప్రకటన.. అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే..

నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.49 శాతం పడిపోగా.. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 0.85 శాతం లాభాల్లో ఉంది. అయితే ఇప్పటికీ నిఫ్టీ 50 ప్రతికూలతల నుంచి బయటపడలేదని నిపుణులు చెబుతున్నారు. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ సంచలన ఆరోపణల నేపథ్యంలో.. గత వారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా పతనమైన సంగతి తెలిసిందే.

అదానీ ఇష్యూ ఒక కంపెనీ సమస్య.. భారత్‌పై దాడి కాదు.. నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు

మార్కెట్లు భారీగా నష్టపోతున్నప్పటికీ కొన్ని స్టాక్స్ మాత్రం ప్రైస్ వాల్యూమ్ బ్రేకవుట్‌ను నమోదు చేశాయి. వీటిని వాచ్‌లిస్ట్‌లో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో అదానీ పోర్ట్స్, పేటీఎం షేర్లు కూడా ఉన్నాయి. వీటి లిస్ట్ ఒకసారి చూద్దాం.

స్టాక్ పేరు

CMP (రూపాయల్లో)

ధరలో మార్పు (శాతాల్లో)

వాల్యూమ్

Zydus Lifesciences Ltd.

470.5

8.3

28,53,837

One 97 Communications Ltd.

550.8

4.9

32,08,096

Adani Ports and Special Economic Zone Ltd.

509.4

2.1

97,57,822

KPIT Technologies Ltd..

799.1

2.7

17,01,326

Elgi Equipments Ltd.

408.0

7.2

8,44,790

భారతదేశపు నంబర్ 1 ఇన్వెస్ట్‌మెంట్ మ్యాగజైన్ దలాల్ స్ట్రీట్ ఇన్వెస్ట్‌మెంట్ జర్నల్ ఈ ఆర్టికల్‌ను అందించింది. విన్నింగ్ స్టాక్స్, సిఫార్సులకు సంబంధించిన అప్‌డేట్స్ క్రమం తప్పకుండా పొందడం కోసం ఈ

దలాల్ స్ట్రీట్ ఇన్వెస్ట్‌మెంట్

లింక్‌పై క్లిక్ చేయండి.

Disclaimer: This above is third party content and TIL hereby disclaims any and all warranties, express or implied, relating to the same. TIL does not guarantee, vouch for or endorse any of the above content or its accuracy nor is responsible for it in any manner whatsoever. The content does not constitute any investment advice or solicitation of any kind. Users are advised to check with certified experts before taking any investment decision and take all steps necessary to ascertain that any information and content provided is correct, updated verified.

  • Read Latest Business News and Telugu News

Also Read:

ఐటీ ఉద్యోగులకు అత్యంత చేదు అనుభవం.. 600 మందిని పీకేసిన ఇన్ఫోసిస్.. ఆ ఒక్క కారణంతో!

97632214

97618960

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *