అప్పుడే నాకు వైసీపీలో కష్టాలు మొదలయ్యాయి.. జగన్ పిలిచి ఏం మాట్లాడారంటే: ఎమ్మెల్యే కోటంరెడ్డి

వైఎస్ జగన్ (Ys Jagan) అంటే ఇప్పటికీ తనకు కొంత సానుకూలత ఉంది అన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. తనకు ఎంతో బాధ ఉందని.. జగన్‌ను ఎంతో ప్రేమించా. ఆరాధించానన్నారు. తనకు ఇలా జరిగి ఉండకూడదని అనుకుంటున్నానని.. ఆయనపై తనకున్న బాధ కసిగా మారకూడదని కోరుకుంటున్నాను అని వ్యాఖ్యానించారు. తాను ఏ రోజూ జగన్‌ ఆలోచనలకు భిన్నంగా పని చేయలేదని.. తనకు వైఎస్సార్‌తో కూడా అనుబంధం ఉందన్నారు. వైఎస్‌ చనిపోయాక జగన్ వెంట నడిచాను అన్నారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన సమయంలో.. ఆయనకు అండగా ఎవరూ ముందుకు రాని సమయంలో తనతో పాటూ కొండా సురేఖ, గట్టు రామచంద్రరావు, అంబటితో పాటూ మరికొందరం అండగా నిలిచామన్నారు.

తాను ఏదైనా చేశానంటేనే అందులో కచ్చితంగా మానవత్వం ఉంటుందన్నారు. అమరావతి రైతులు యాత్ర చేస్తూ జిల్లాలోకి వచ్చిన సమయంలో.. తన నియోజకవర్గం వచ్చిన సమయంలో.. స్థానికులు వరదల్లో చిక్కుకున్నారన్నారు. ఆ సమయంలోనే అమరావతి రైతులు ఉంటే వారి దగ్గరకు వెళ్లి పలకరించానన్నారు. కానీ వారే తనను గుర్తుపట్టి పలకరించారని.. వారు విడిది చేసిన భవనంలో ఉన్న మహిళలు కన్నీళ్లు పెట్టుకున్నారని.. ఆ బాధను చూసి తనకు చాలా జాలేసిందన్నారు. వారు ఉండేందుకు ఓ కళ్యాణ మండపంలో ఏర్పాట్లు చేస్తానని వారితో చెప్పానన్నారు. వారిని చూసిన తర్వాత పెయిడ్‌ ఆర్టిస్టులని ఎవరూ అనుకోరన్నారు. ఒక ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయాన్ని.. వారి త్యాగాన్ని మరో ప్రభుత్వం గుర్తించకపోవడంతో వాళ్లు దగా పడ్డారన్నారు. అందుకే ఉద్యమం చేస్తున్నారని.. ఆ విషయమే జగన్‌‌కు కోపం తెప్పించిందన్నారు.

అమరావతి రైతుల (Amaravati Farmers) దగ్గరకు వెళ్లిన విషయంపై సీఎం జగన్ (CM Jagan) తనను గట్టిగానే అడిగారని కోటంరెడ్డి చెప్పుకొచ్చారు. తాను చేసింది కరెక్టు కాదన్నారని.. ఇలా చేయడమేంటని అన్నారని.. తాను చేసినదాని వల్ల పార్టీ గౌరవం.. ‘మీ’ గౌరవం పెరుగుతుందని ఆయనతో చెప్పానని వివరించారు. తాను అక్కడ అధినేత నిర్ణయమే శిరోధార్యమని అమరావతి రైతులకే చెప్పానని.. అమరావతి రైతులకు 2020లో కష్టాలు మొదలైతే.. తనకు మాత్రం ఆ అమరావతి రైతుల పరామర్శతోనే వైఎస్సార్‌సీపీలో కష్టాలు మొదలయ్యాయని భావిస్తున్నాను అన్నారు.

ఇంతలో ట్యాపింగ్ వ్యవహారం తనకు తెలిసిందన్నారు. జనవరి 1న తనను రమ్మని సీఎం నుంచి కబురు వచ్చిందన్నారు. కానీ ఆ మరుసటి రోజు సీఎంను కలిశానని.. అప్పుడు నియోజకవర్గానికి సంబంధించి చెప్పినవాటిలో కొన్ని జీవోలు వచ్చినా ఆర్థికపరమైన అనుమతులు రాలేదని సీఎతో చెప్పానన్నారు. కొన్ని జీవోలైతే అసలు రాలేదని చెప్పానని.. వెంటనే తొందరగా చేయమని అధికారులకు చెప్పానని.. నెలలోపు చేస్తామని చెప్పారన్నారు. తాను వైఎస్సార్‌సీపీ నుంచి బయటకు వచ్చాను కాబట్టి కోపం ఉండొచ్చని.. రాజకీయ వ్యూహాలనేవి చెప్పినా ఫలించవు అన్నారు.

Read Latest

Andhra Pradesh News

and

Telugu News

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *