ఏప్రిల్ నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు క్రమబద్దీకరిస్తామని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. ఏప్రిల్ నెల నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్దీకరిస్తామని తెలిపారు. దీంతో పాటు..సెర్ఫ్ ఉద్యోగులకు పే స్కేల్ ను సవరిస్తామని చెప్పారు. అటు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తుల మేరకు కొత్త EHS విధానాన్ని తీసుకురాబోతున్నామని హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రకటించారు. ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్టును ఏర్పాటు చేసి ఇందులో ప్రభుత్వ ప్రతినిధులతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, రిటైర్డ్ ఉద్యోగుల ప్రతినిధులను భాగస్వాములుగా చేస్తామన్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలను త్వరలోనే ప్రకటిస్తామని హరీశ్ రావు తెలిపారు.
©️ VIL Media Pvt Ltd.