కొత్త ల్యాప్‌టాప్ అదిరింది.. ఒక్కసారి చార్జ్ చేస్తే 14 గంటలు వాడుకోవచ్చు, 2 ఏళ్లు వారంటీ!

Lenovo Laptop | కొత్త ల్యాప్‌టాప్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే గుడ్ న్యూస్. ఎందుకంటే మార్కెట్‌లోకి కొత్త ల్యాప్ టాప్ వచ్చింది. దీన్ని ఒక్కసారి చార్జింగ్ పెడితే ఏకంగా 14 గంటల పాటు ఉపయోగించుకోవచ్చు. ఇంతకీ అది ఏ ల్యాప్ టాప్ అని అనుకుంటున్నారా? దాని పేరు లెనొవొ (Lenovo) ఐడియాపాడ్ 1. లెనొవొ కంపెనీ తాజాగా మార్కెట్‌లోకి ఈ కొత్త ల్యాప్ టాప్‌ను (Laptop) తీసుకువచ్చింది. ఇందులోని ఫీచర్లు, దీని ధర ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

స్టూడెంట్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్ లక్ష్యంగా లెనొవొ కంపెనీ ఈ కొత్త ల్యాప్ టాప్‌ను తీసుకువచ్చింది. ఇందులో ఏఎండీ రైజెన్ ఆర్ 3 ప్రాసెసర్ ఉంటుంది. కంపెనీ నుంచి ఈ ప్రాసెసర్‌తో వస్తున్న తొలి ల్యాప్ టాప్ ఇదే కావడం గమనార్హం. ఇందులో 15.6 ఇంచుల డిస్‌ప్లే ఉంటుంది. ఫుల్ హెచ్‌ఢీ ప్లస్ రెజల్యూషన్‌తో 220 నిట్స్ బ్రైట్‌నెస్‌తో ఈ డిస్‌ప్లే ఉంటుంది. అలాగే ఈ ల్యాప్ టాప్‌లో 720పీ వెబ్ క్యామ్ ఉంటుంది. ఈ ల్యాప్ టాప్‌లో 1.5 వాట్ డ్యూయలె స్టీరియో స్పీకర్ ఉంటుంది. డాల్బే ఆటమ్స్ సపోర్ట్ చేస్తుంది. రెండు మైక్రో ఫోన్స్ ఉంటాయి.

సగం ధరకే 55 ఇంచుల స్మార్ట్‌ టీవీ.. షావోమి బంపరాఫర్!

ఇంకా ఈ ల్యాప్ టాప్‌లో రేడియన్ 610 ఎం గ్రాఫిక్స్ కార్డు ఉంటుంది. జెన్ 2 ఆర్కిటెక్చర్‌పై ఈ ల్యాప్ టాప్‌లోని ప్రాసెసర్ రూపొందించింది. ఇందులో 8 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఈ ల్యాప్ టాప్‌లో 65 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. ఒక్కసారి చార్జ్ చేస్తే ఈ ల్యాప్ టాప్ 14 గంటల వరకు చార్జింగ్ కలిగి ఉంటుంది. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ ల్యాప్ టాప్ పని చేస్తుంది.

రూ.7 వేల స్మార్ట్‌ వాచ్‌ను రూ.1400కే కొనేయండిలా!

యూఎస్‌బీ 2.0 పోర్ట్, యూఎస్‌బీ 3.2 జెన్ 1, యూఎస్‌బీ సీ పోర్ట్, 4 ఇన్ 1 కార్డ్ రీడర్,హెడ్‌ఫోన్ జాక్, హెచ్‌డీఎంఐ 1.4 పోర్ట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా ఈ ల్యాప్ టాప్ వైఫై 6 సపోర్ట్ చేస్తుంది. ఈ ల్యాప్ టాప్‌పై 2 ఏళ్ల వరకు వారంటీ ఉంటుంది. దీని ధర రూ. 44,690 నుంచి ఉంది. అమెజాన్ లేదా కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీరు ఈ ల్యాప్ టాప్ కొనొచ్చు. అమ్మకాలు ఫిబ్రవరి 8 నుంచి ప్రారంభం అవుతాయి. అందువల్ల ఎక్కువ సేపు చార్జింగ్ ఇచ్చే ల్యాప్ టాప్ కోరుకునే వారు దీన్ని పరిశీలించొచ్చు. ధర అందుబాటులోనే ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *