Srikakulam: ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మంత్రి ధర్మాన ప్రసాద రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబు వస్తే మొదట తుపాకీ పేల్చేది వాలంటీర్లపైనే అని.. చంద్రబాబు కన్నా ముందే మనం తుపాకీ పేల్చాలని వ్యాఖ్యానించారు. ఏది మంచి ప్రభుత్వమని చెప్పే హక్కు వాలంటీర్లకు ఉందన్న మంత్రి ధర్మాన.. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు చెప్పాల్సింది వాలంటీర్లే అని Dharmana Prasada Rao స్పష్టం చేశారు.
మంత్రి ధర్మాన ప్రసాద రావు శ్రీకాకుళంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు కోసమే ఓ పత్రిక అసత్య కథనాలు ప్రచురిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లు తెలివైన వారు కాబట్టి.. ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. లేకపోతే.. చంద్రబాబు (Chandrababu Naidu) అధికారంలోకి వచ్చి తుపాకీ పేల్చేది వాలంటీర్లపైనే అని వ్యాఖ్యానించారు. మంత్రి ధర్మాన చేసిన వ్యాఖ్యలతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.
Read Latest
Andhra Pradesh News
and