టెక్ ఉద్యోగులపై పిడుగు.. 6,500 మందిని తొలగించిన దిగ్గజ కంపెనీ.. లాభాలు తగ్గటమేనటా!

Layoffs: కరోనా మహమ్మారి తర్వాత ఏర్పడిన పరిస్థితులతో టెక్ ఉద్యోగులు భయం భయంగా రోజులు వెళ్లదీస్తున్నారు. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్‌బుక్ వంటి దిగ్గజ సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగాల కోత విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలో టెక్ సంస్థ, ప్రముఖ కంప్యూటర్ల తయారీ కంపెనీ డెల్ చేరిపోయింది. ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగుల్లో సుమారు 5 శాతం మేర కోత విధిస్తున్నట్లు సంకేతాలిచ్చినట్లు బ్లూమ్ బర్గ్ నివేదిక వెల్లడించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు మనం చూద్దాం.

డెల్ టెక్నాలజీస్ సుమారు 6,650 మందిని తొలగిస్తున్నట్లు తెలిపింది బ్లూమ్‌బర్గ్ నివేదిక. ఇది డెల్ కంపెనీల్లో ప్రపంచవ్యాప్తంగా పని చేస్తున్న ఉద్యోగుల్లో 5 శాతంగా ఉంటుందని పేర్కొంది. బ్లూమ్‌బర్గ్ ప్రచూరించిన మెమో ప్రకారం.. కో చీఫ్ ఆపరటింగ్ ఆఫీసర్ జెఫ్ క్లర్క్ తమ ఉద్యోగులకు వివిధ అంశాలను వివరిస్తూ లేఖ రాశారు. ‘ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొన్న సందర్భంలో ఆదాయం తగ్గిపోయే ప్రమాదం ఉందని కంపెనీ గ్రహించింది. గతంలోనూ ఆర్థికంగా నష్టాలను చవిచూసినా.. మళ్లీ పుంజుకున్నాం. మార్కెట్ పుంజుకున్నప్పుడు మళ్లీ తమ స్థానాన్ని పొందడానికి మేము సిద్ధంగా ఉన్నాం.’ అని జెఫ్ క్లర్క్ లేఖలో పేర్కొన్నారు

ఐటీ ఉద్యోగులకు అత్యంత చేదు అనుభవం.. 600 మందిని పీకేసిన ఇన్ఫోసిస్.. ఆ ఒక్క కారణంతో!

కోవిడ్ మహమ్మారి విజృంభించిన క్రమంలో 2020లో సంస్థ ఉద్యోగాల కోత విధించింది. ఇప్పుడు మళ్లీ ప్రపంచవ్యాప్తంగా 5 శాతం మందిని తొలగిస్తున్నట్లు కంపెనీ అధికారిక ప్రతినిధి తెలిపారు. మరోవైపు.. గత ఏడాది 2022, నవంబర్‌లో హెచ్‌పీ కంపెనీ సుమారు 6 వేల మందిని వచ్చే మూడేళ్లలో తొలగిస్తామని తెలిపింది. అందుకు పర్సనల్ కంప్యూటర్లకు డిమాండ్ తగ్గుతుండంతో సంస్థ లాభం పడిపోతోందని పేర్కొంది. అంతేకాదు సిస్కో సిస్టమ్స్, ఇంటర్నేషనల్ బిజినెస్ కార్పొరేషన్ వంటివి సైతం ఉద్యోగులను తొలగించాయి. 2022లో టెక్ సంస్థలు ఏకంగా 97,171 మందిని ఉద్యోగాల నుంచి పేకేశాయి.

Read Latest

Business News and Telugu News

20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

నష్టాల్లోనూ అదుర్స్.. టాప్ ట్రెండింగ్‌లోకి ‘లిక్కర్’ స్టాక్.. ఇన్వెస్టర్లకు కాసుల పంట!

భారీగా తగ్గుతున్న బంగారం ధరలు.. ఇదే మంచి ఛాన్స్.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *