దేశంలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ డీల్.. డీమార్ట్ దమానీ ధమాకా.. 28 లగ్జరీ అపార్ట్‌మెంట్స్.. రూ.1238 కోట్లు..

Real Estate Deal: డీమార్ట్ వ్యవస్థాపకుడు రాధాకృష్ణ దమానీ.. సరికొత్త రికార్డు సృష్టించారు. దేశంలోనే అతిపెద్ద ప్రాపర్టీ డీల్‌ను తన పేరిట లిఖించుకున్నారు. ఏకంగా రూ.1238 కోట్లు పెట్టి ముంబైలో 28 హౌసింగ్ యూనిట్లను కొనుగోలు చేశారు. ఇందులో రాధాకృష్ణ దమానీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు కూడా ఉన్నారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను బట్టి Zapkey.com వెల్లడించింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కీలక ప్రకటనలు చేసింది. ఈ ప్రతిపాదనల నేపథ్యంలోనే.. ఈ పెద్ద డీల్ జరిపినట్లు సమాచారం.

లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ టాక్స్ విషయంలో పలు సవరణలు చేసింది కేంద్ర ప్రభుత్వం. దీని ప్రకారం ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1 నుంచి.. విలాసవంతమైన ప్రాపర్టీల విక్రయంతో వచ్చే మూలధన ఆదాయాన్ని.. తిరిగి పెట్టుబడిగా పెట్టేందుకు గరిష్ట పరిమితిని రూ.10 కోట్లకు పరిమితం చేసింది. హౌసింగ్ ప్రాపర్టీలు కూడా ఇందులోకి వస్తాయి. ప్రస్తుతం అలాంటి పరిమితి ఏం లేదు.

కేంద్రం గుడ్‌న్యూస్.. ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం.. ఏకంగా కోటి మందికి ప్రయోజనం!

అయితే ఇప్పుడు దమానీ రియల్ ఎస్టేట్ డీల్‌లో కొన్ని ప్రాపర్టీలు కొన్ని కంపెనీల పేరు మీద కూడా ఉన్నట్లు డాక్యుమెంట్లు స్పష్టం చేస్తున్నాయి. ఈ కొనుగోలు చేసిన మొత్తం ప్రాపర్టీ.. 1,82,084 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండగా.. 101 కార్లు పార్కింగ్ చేసుకునేందుకు వీలుగా ఉన్నట్లు తెలిసింది. రిజిస్ట్రేషన్ 2023, ఫిబ్రవరి 3న జరిగినట్లు డాక్యుమెంట్లలో తేలింది.

కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లిన గూగుల్ ఇంజినీర్.. ఇంతలో ఆమెకు మెసేజ్.. తెరిచి చూస్తే!

డీమార్ట్ ఓనర్ రాధాకృష్ణ దమానీ.. గతంలో కూడా రూ. 400 కోట్ల విలువైన ఏడు ప్రాపర్టీలను కొనుగోలు చేశారు. ప్రస్తుతం డీమార్ట్.. 11 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ముంబయి, హైదరాబాద్, పుణె, బెంగళూరు వంటి నగరాల్లో ప్రాపర్టీలను కొనుగోలు చేసింది కూడా.

Read Latest

Business News and Telugu News

20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

Also Read:

ట్విట్టర్ బాటలోనే ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్.. ఇక డబ్బులు కడితేనే అలా..!

97635797

97632214

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *