పాకిస్తాన్‌లో ‘పఠాన్’ ఇల్లీగల్ స్క్రీనింగ్.. రంగంలోకి దిగిన సెన్సార్ బోర్డ్

సిద్ధార్థ్ ఆనంద్ (Siddharth Anand) దర్శకత్వంలో తెరకెక్కిన ‘పఠాన్’ (Pathaan) చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌‌గా నిలిచింది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) కెరియర్‌లోనే అత్యధిక గ్రాసర్‌గా పేరు తెచ్చుకుంది. దీపికా పదుకొనె (Deepika Padukone) హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ ఇప్పటికే రూ. 400 కోట్ల కలెక్షన్స్ రాబట్టి ఇంకా సక్సెస్‌‌ఫుల్‌గా ప్రదర్శించబడుతోంది. ఇక పఠాన్ ప్రపంచవ్యాప్తంగా విడుదలై (జనవరి 25) రెండు వారాలు అవుతుండగా.. పాకిస్తాన్‌ (Pakistan) దేశంలో ఇల్లీగల్ స్క్రీనింగ్స్ నివేదించబడ్డాయి. దీంతో రంగంలోకి దిగిన సింధ్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్స్ సెన్సార్ (SBFC).. వాటిపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం కరాచీలోని డిఫెన్స్ హౌసింగ్ అథారిటీలో జరుగుతున్న ప్రదర్శనలు ఆగిపోయినట్లు సమాచారం. ఈ స్క్రీనింగ్స్‌కు సంబంధించిన టికెట్స్‌ను ఆన్‌లైన్‌లో ఒక్కొక్కటి రూ. 900 (పాకిస్థానీ రూపాయి)లకు విక్రయిస్తున్నట్లుగా పాకిస్తానీ డైలీ వెల్లడించింది. అంతేకాదు ఇవి ఫైర్‌వర్క్స్ ఈవెంట్స్ నిర్వహిస్తున్న ప్రైవేట్ స్క్రీనింగ్స్ అని కూడా సదరు నివేదికలో పేర్కొంది.

SBFC నిబంధనల ప్రకారం ‘ఏదైనా మూవీ పబ్లిక్ ఎగ్జిబిషన్ కోసం బోర్డు ద్వారా ధృవీకరించబడితే తప్ప ఏ వ్యక్తి కూడా పబ్లిక్ లేదా ప్రైవేట్ ఎగ్జిబిషన్‌ను నిర్వహించకూడదు లేదా ఏర్పాటు చేయకూడదు’. ఇలా బోర్డు సర్టిఫికెట్ పొందని చిత్రాలను ప్రదర్శిస్తే బాధ్యులైన వారికి మూడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.100,000 వరకు జరిమానా విధించవచ్చు. కాగా ఈ మూవీ షోస్‌ను రద్దు చేయాలని సింధ్ బోర్డ్ ఆఫ్ ఫిలిమ్ సెన్సార్.. ఫైర్‌వర్క్ ఈవెంట్స్‌ను డిమాండ్ చేయడమే కాక స్క్రీనింగ్‌ను రద్దు చేసింది.

2019లో ఇండియన్ ఫిలిం మేకర్స్, నిర్మాతలు పాకిస్తానీ ఆర్టిస్టులతో కలిసి పనిచేయకూడదని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత పాకిస్తానీ చిత్రనిర్మాతలు సైతం భారతదేశ కళాకారులకు సంబంధించి ఇదే విధమైన నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి ఒకరి సినిమాల ప్రదర్శన మరొకరి దేశంలో ఆగిపోయింది.

ఇదిలా ఉంటే, నాలుగేళ్ల గ్యాప్ తర్వాత షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ మూవీ ద్వారా వెండితెరపై కనిపించగా.. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ రికార్డులు బద్దలు కొడుతోంది. ఇప్పటికే అమీర్ ఖాన్ ‘దంగల్’ మూవీ కలెక్షన్లను దాటేసింది. ఈ క్రమంలో ఇండియాలో రూ. 400 కోట్లు క్రాస్ చేసిన మొదటి హిందీ చిత్రంగా నిలిచింది షారుఖ్ ‘పఠాన్’. ఇటీవలే మూవీ టీమ్ సక్సెస్ బాష్ నిర్వహించగా పాల్గొన్న షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనె, సిద్ధార్థ్ ఆనంద్, జాన్ అబ్రహం ‘పఠాన్‌’ చిత్రంలో తమ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ అభిమానులతో పంచుకున్నారు.

Read Latest

Tollywood updates and

Telugu news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *