Gold Rates: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్. ఇటీవలి కాలంలో రెండేళ్ల గరిష్టాన్ని దాటి ట్రేడయిన గోల్డ్, సిల్వర్ రేట్లు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత రెండు రోజుల వ్యవధిలో భారీగా పడిపోయాయి. దీంతో ఇప్పుడు కొనేందుకు మంచి సమయమేనా అని చాలా మంది ఆలోచిస్తున్నారు. ఈ రెండు రోజుల్లోనే తులం బంగారం ధర 22 క్యారెట్లపై రూ.1200 మేర పడిపోయింది. ఇక సిల్వర్ ఏకంగా రూ.3600 వరకు తగ్గడం గమనార్హం. ఇక ప్రస్తుతం హైదరాబాద్, దిల్లీ సహా ఇతర ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? అంతర్జాతీయంగా తగ్గుతుందా? ఎందుకు తగ్గుతున్నాయో? కారణాలు తెలుసుకుందాం.
ప్రస్తుతం అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1865 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇది 2 రోజుల కిందట దాదాపు 20 డాలర్ల వద్ద ట్రేడయింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు విషయానికి వస్తే ప్రస్తుతం 22.36 డాలర్ల వద్ద ఉంది. ఇది రెండు రోజుల క్రితం ఏకంగా 24 డాలర్లపైన ఉంది. డాలర్‌తో పోలిస్తే మాత్రం రూపాయి మారకం విలువ క్షీణిస్తోంది. ప్రస్తుతం రూ.82.488 వద్ద కొనసాగుతోంది.
97538673
ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర 22 క్యారెట్లకు రూ..52,400 వద్ద ఉంది. 2 రోజుల్లో రూ.1200 మేర పతనమైంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ.57,160 వద్ద ఉంది. ఇక దిల్లీలో కూడా బంగారం ధర భారీగా తగ్గుతోంది. అక్కడ 22 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర 22 క్యారెట్లకు రూ.52,550 వద్ద ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.57,310 వద్ద కొనసాగుతోంది.
అదానీకి రూ.5 లక్షల కోట్ల లాస్.. అంతా హిండెన్‌బర్గ్ వల్లే.. దీని వెనకుంది ఎవరు? ఈ విషయాలు మీకు తెలుసా?
ఇక వెండి విషయానికి వస్తే ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రూ.74,200 వద్ద ఉంది. ఇది 2 రోజుల వ్యవధిలోనే ఏకంగా రూ.3600 పతనమైంది. ఇక దిల్లీలో కేజీ సిల్వర్ రెండు రోజుల్లో ఏకంగా రూ.3500 పతనం కాగా.. ప్రస్తుతం రూ.71,200 మార్కుకు చేరింది. హైదరాబాద్‌తో పోలిస్తే దిల్లీలో బంగారం ధర కాస్త ఎక్కువగా, వెండి ధర కాస్త తక్కువగా ఉంటుంది. స్థానికంగా ఉండే పన్నులను బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి.
కేంద్రం గుడ్‌న్యూస్.. ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం.. ఏకంగా కోటి మందికి ప్రయోజనం!
ఇక యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఇటీవల వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. దీంతో.. డాలర్ పుంజుకుంది. బాండ్ ఈల్డ్స్‌కు డిమాండ్ పెరిగింది. ఇదే సమయంలో గోల్డ్, సిల్వర్ డిమాండ్ పడిపోయింది. ఇదే నేపథ్యంలో బంగారం, వెండి ధరలు పతనమవుతున్నాయి. ఈ పరిస్థితి మరికొన్నిరోజులు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Read Latest
Business News and Telugu News
20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.
Also Read:
ఈపీఎఫ్ కొత్త రూల్‌తో గుడ్‌న్యూస్.. బడ్జెట్‌లో ప్రకటన.. అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే..