మంచి చేయకపోయినా పర్లేదు.. చెడు మాత్రం చేయకండి.. ప‌వ‌న్ ఫ్యాన్స్‌కి డైరెక్టర్ రిక్వెస్ట్

హీరోలంటే అభిమానం ఉండటంలో త‌ప్పు లేదు. కానీ కొన్ని సంద‌ర్భాల్లో అభిమానం హ‌ద్దులు దాటేస్తుంటుంది. ఇలా హ‌ద్దులు దాటే అభిమానం తెలిసో తెలియ‌కో వారి అభిమాన హీరోల‌కే న‌ష్టాన్ని క‌లిగిస్తుంది. ఈ విష‌యాన్ని గ్ర‌హించాల‌ని అంటున్నారు ద‌ర్శ‌కుడు సాయి రాజేష్‌. మెగా ఫ్యామిలీకి ఎంతో స‌న్నిహితంగా ఉండే ఈ డైరెక్ట‌ర్ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ఆయ‌న ప‌వ‌న్ క‌ళ్యాణ్ సెన్సిబుల్ ఫ్యాన్స్‌కి రిక్వెస్ట్ పెట్టారు. అస‌లు ఆయ‌న అలా ఎందుకు రిక్వెస్ట్ పెట్టాల్సి వ‌చ్చింద‌నే వివ‌రాల్లోకి వెళితే..

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ ప్ర‌స్తుతం సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీనికి OG అనే వ‌ర్కింగ్ టైటిల్ అనుకుంటున్నారు. మ‌రో వైపు రామ్ చ‌ర‌ణ్‌ను ఆయ‌న అభిమానులు OG అని సంబోధిస్తున్నారు. వీరి మ‌ధ్య OG మా హీరో అంటే మా హీరో అనే వాద‌న చెల‌రేగింది. ఒక‌వైపు బాబాయ్ ఫ్యాన్స్‌.. మరో వైపు అబ్బాయి ఫ్యాన్స్ మాట‌ల‌తో గొడ‌వ ప‌డ్డారు. నిజానికి ఒక ఫ్యామిలీకి చెందిన హీరోల ఫ్యాన్స్ ఇలా గొడ‌వ పడ‌టం అందరినీ ఆశ్చ‌ర్య‌పరిచింది. మ‌రీ ముఖ్యంగా ప‌వ‌న్‌, చ‌ర‌ణ్ అభిమానులు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే రామ్ చ‌ర‌ణ్‌కి ఎంత అభిమాన‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అలాంటిది వారి అభిమానులు సోష‌ల్ మీడియాలో గొడ‌వ ప‌డ‌టం కాస్త ఇబ్బంది క‌రంగానే ఉంటుంది. ఈ విష‌యంపైనే సాయి రాజేష్ త‌న‌దైన కోణంలో విష‌యాన్ని కుండ బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు చెప్పేశారు.

‘‘గత సంవ‌త్స‌ర కాలంగా, నాగ‌బాబుగారి ద్వారా అయితే కానీ, క‌ళ్యాణ్‌గారికి అత్యంత స‌న్నిహితులుగా మెలిగే వ్య‌క్తుల‌తో కానీ, వారి ద్వారా తెలుసుకున్న విష‌యం ఏంటంటే.. క్ష‌ణం తీరిక లేకుండా ప్ర‌జా సేవ కార్య‌క్ర‌మాలు చేస్తూ కూడా.. క‌ళ్యాణ్‌గారు ఇన్ని సినిమాలు చేయ‌టానికి కార‌ణం జ‌న‌సేన‌ ఆర్థికంగా బ‌లంగా లేక‌పోవ‌ట‌మే. ఓటు బ్యాంకు రాజ‌కీయాలు క్రేజ్ మీద న‌డ‌వ‌వు. సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఉంటూ ఓ సైడ్ తీసుకోకూడ‌ద‌నుకునే నాలాంటి వాళ్లమే ఆయ‌న క‌ష్టం చూసి జ‌ల్సా స్పెష‌ల్ షోస్ వంటివి మా వంతుగా చేశాం. మీరు మంచి చేయ‌క‌పోయినా ప‌ర్లేదు. హాని చేయ‌కండి. ఆయ‌న‌కి, పార్టీకి సినిమాలు మాత్ర‌మే చూసుకుని ఉండండి. కానీ క‌లుపుకుని పోవాల్సిన బాధ్య‌త‌, ఒక మాట ప‌డాల్సి వ‌చ్చిన‌ప్పుడు ఆలోచించాల్సిన సిట్యువేష‌న్‌లో మీరున్నారు. ఫ్యాన్ వార్‌లో తాత్కాలిక గెలుపు కోసం ప్ర‌య‌త్నిస్తే, చాలా మంది మ‌నుషుల్లో క‌ళ్యాణ్‌గారి ప‌ట్ల‌, పార్టీ ప‌ట్ల శాశ్వ‌త‌మైన శ‌త్రుత్వం క‌లిగిస్తున్నారు. మేం ఆయ‌న సినిమాల‌కు మాత్రమే అభిమానులం అనుకునే వారికి కాదు ఈ పోస్ట్‌. మా హీరో, ఆయ‌న పార్టీ బాగుండాల‌ని కోరుకునే నాకు తెలిసిన అతి కొద్ది మంది సెన్సిబుల్ అభిమానుల‌కి ఈ రిక్వెస్ట్‌. ఇక ఆపేయండి. ఫుల్ స్టాప్ పెట్టేయండి. లేదా మీరు మాత్రం గొడ‌వ‌ల‌కు దూరంగా ఉండండి. ఇక్క‌డ ఎవ‌రూ త‌గ్గేది లేదు, పెరిగేది లేదు’’ అని అన్నారు.

విషయాన్ని ప్రతి పాయింట్ వైజ్ కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడావ్ అంటూ నెటిజన్స్ సాయి రాజేష్ పోస్ట్‌పై రియాక్ట్ అవుతున్నారు.

ALSO READ:

97634086

ALSO READ: Amigos: మా ఫ్యామిలీ హీరోల్లో కళ్యాణ్‌ రామ్ అన్న ఎక్కువ ప్రయోగాలు చేశారు: ఎన్టీఆర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *