మెగా కాంపౌండ్‌లోనే బాబీ.. అక్కడే మరో సినిమాకు ప్లానింగ్

చాలా ఏళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)) అతి పెద్ద కమర్షియల్ హిట్ దక్కించుకున్నారు. రీఎంట్రీ తర్వాత ఒకటి రెండు సక్సెస్‌లు సాధించినప్పటికీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి చేయలేదు. కానీ ఈ ఏడాది సంక్రాంతికి ‘వాల్తేర్ వీరయ్య’ (Walatir Veerayya) చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిరు.. తన స్టామినా ఏంటో నిరూపించారు. అయితే ఈ మూవీ సక్సెస్‌కు ప్రధాన కారణం డైరెక్టర్ బాబీ (Bobby). తను రాసుకున్న కథ, ఎగ్జిక్యూట్ చేసిన విధానం ఇంప్రెసివ్‌గా ఉంది. దీనిపై బాబీని అనేక వేదికలపై ఓపెన్‌గానే మెచ్చుకున్నారు మెగాస్టార్. అంతేకాదు బాబీ తనకు అభిమాని కాదు.. ఈ సినిమా తర్వాత తానే బాబీకి అభిమాని అయిపోయానంటూ కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో బాబీ నెక్స్ట్ మూవీ కూడా మెగా కాంపౌండ్‌ (Mega compound) లోనే ఉండనున్నట్లు తెలుస్తోంది.

దర్శకుడు బాబీ త్వరలో మరో మెగా హీరోతో అసోసియేట్ కానున్నాడని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రీసెంట్ మీడియా ఇంటరాక్షన్‌లో బాబీ మాట్లాడుతూ.. వాల్తేర్ వీరయ్య’ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నానంటూ ప్రేక్షకుల నుంచి లభిస్తున్న స్పందనకు గాను వారికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మరో మెగా హీరోతో కలిసి పని చేయనున్నట్టు ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తానని కూడా బాబీ తెలిపాడు.

డైరెక్టర్ బాబీ చేసిన ఈ ప్రకటనతో మెగా అభిమానులు ఖుష్ అవుతున్నారు. ఇంతకీ ఆ మెగా హీరో ఎవరా? అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇక గతంలో బాబీ.. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది.

ఇక మెగా హీరోల విషయానికొస్తే.. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఇప్పట్లో ఖాళీ అయ్యే పరిస్థితి లేదు. శంకర్‌తో RC15 తర్వాత జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో ప్రాజెక్ట్‌కు కమిట్ అయ్యాడు. వరుణ్ తేజ్ ప్రస్తుతం ‘గాండీవధారి అర్జున’ చిత్రంలో నటిస్తున్నాడు. సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్‌తో చేసే అవకాశం ఉన్నప్పటికీ.. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ అయిపోయిన బాబీ వారితో చేస్తాడా? లేదా? అనేది అనుమానమే. ఒకవేళ పుష్ప2 తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో చేసే చాన్స్‌లు ఏమైనా ఉన్నాయా? చూడాల్సిందే.

Read Latest

Tollywood updates and

Telugu news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *