Amigos Pre release event: టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమపై స్టార్ హీరో ఎన్టీఆర్ సీరియస్ అయ్యారా! అంటే అవుననే అనక తప్పదు లేటెస్ట్ వైరల్ వీడియో చూస్తుంటే. అసలేం జరిగిందనే వివరాల్లోకి వెళితే.. ఆదివారం సాయంత్రం కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘అమిగోస్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దీనికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈయన లేటెస్ట్ మూవీ NTR 30 అప్‌డేట్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అప్పటికే ఈవెంట్‌లో ఉన్న నందమూరి ఫ్యాన్స్ … NTR 30 అప్‌డేట్ ఎప్పుడంటూ గోల గోల చేస్తున్నారు. ఎన్టీఆర్ రాకతో ఈ గోల పెరిగిందే తప్ప.. తగ్గలేదు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ గ్రహించారు. కానీ సైలెంట్‌గా ఉంటూ వచ్చారు.
అయితే యాంకర్ సుమ ఎన్టీఆర్ స్పీచ్‌కి ముందు మాట్లాడేటప్పుడు ఎన్టీఆర్ తన NTR 30 అప్‌డేట్ ఇస్తారంటూ మాట్లాడింది. ఆమె అలా మాట్లాడుతున్నప్పుడు ఎన్టీఆర్ సుమ వైపు చాలా సీరియస్‌గా చూశాడు. అయితే పక్కనే ఉన్న కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్‌ని కూల్ చేయటంతో తారక్ సైలెంట్ అయిపోయారు. అయితే తాను మాట్లాడుతన్నప్పుడు మాత్రం ఫ్యాన్స్‌కి ఓ రేంజ్‌లో క్లాస్ పీకారు. ‘‘సినిమా అప్డేట్ కోసం మీ ఆరాటం, తాపత్రయం మాకు అర్థమవుతోంది. దర్శక నిర్మాతలకు ఒత్తిడిని పెంచకండి. దాంతో నష్టం కలుగుతుంది. అప్డేట్ ఉంటే.. ఇంట్లో మా భార్య కంటే మీకే ముందుగా చెబుతాం. ఇప్పుడు మనం ప్రపంచ స్థాయిలో ఉన్నాం. మంచి సినిమా అందించాలని అనుకుంటాం. మంచి సందర్భం కోసం చూశాం. ఈరోజు మంచి రోజు కాబట్టి చెబుతున్నాను. ఫిబ్రవరిలో సినిమా(NTR 30)ను ప్రారంభిస్తాం. మార్చి 20న షూటింగ్ ప్రారంభిస్తాం. 2024 ఏప్రిల్ 5న సినిమాను రిలీజ్ చేస్తాం’’ అన్నారు.
RRR వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ సినిమాల ఎంపిక మారింది. యూనిక్ పాయింట్‌తో సినిమా చేయాలని ఎదురు చూస్తున్నారు. ఆలస్యమైనా పర్లేదు కానీ.. అదిరిపోయే సినిమాతో ప్రభంజనం క్రియేట్ చేయాలనేదే ఆయన ఆలోచనగా కనిపిస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా NTR 30ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.
ALSO READ:
97635158
ALSO READ:
Vijay Deverakonda: విజయ్ దేరవకొండ కొత్త సినిమా.. పరశురాంతో చర్చలు షురూ.. లైన్‌లోకి దిల్ రాజు
ALSO READ: Amigos: మా ఫ్యామిలీ హీరోల్లో కళ్యాణ్ రామ్ అన్న ఎక్కువ ప్రయోగాలు చేశారు: ఎన్టీఆర్
- Read Latest Tollywood updates and Telugu News