రుద్రంగి ఫోక్ సాంగ్‌‌లో బిగ్బాస్ దివి

రుద్రంగి ఫోక్ సాంగ్‌‌లో బిగ్బాస్ దివి బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలకు రైటర్‌‌‌‌గా పని చేసిన అజయ్ సామ్రాట్  దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘రుద్రంగి’. జగపతి బాబు, మమతా మోహన్ దాస్, ఆశిష్ గాంధీ, విమలా రామన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రసమయి బాలకిషన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి మొదటి పాటను శనివారం రిలీజ్ చేశారు. ఈ ఫోక్ సాంగ్‌‌లో ‘బిగ్ బాస్’ ఫేమ్ దివి ఆడి పాడింది. ‘పుట్టా మీద పాల పిట్ట.. జాజి మొగులాలి.. ముట్టబోతే తేలు కుట్టే జాజి మొగులాలి’ అంటూ  రెలారే గంగ పాట నుంచి ఈ లిరిక్స్ సేకరించారు అభినయ శ్రీనివాస్. నాఫల్ రాజా ఏఐఎస్  ట్యూన్ కంపోజ్ చేయగా, మోహన భోగరాజు పాట పాడింది. భాను మాస్టర్ డ్యాన్స్ కొరియోగ్రఫీలో దివి వేసిన స్టెప్స్ ఆకట్టుకున్నాయి.

©️ VIL Media Pvt Ltd.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *