రైటర్ పద్మభూషణ్‌పై మహేష్ బాబు ట్వీట్.. సుహాస్ నటనకు ఫిదా!

నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ (Shanmukha Prasanth) దర్శకత్వంలో సుహాస్ (Suhas) హీరోగా తెరకెక్కిన చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’ (Write Padmabhushan). చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిలింస్ బ్యానర్లపై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయికగా నటించింది. ఫిబ్రవరి 3న విడుదలైన చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇక ఈ మూవీ కంటెంట్, నటీనటుల పెర్ఫామెన్స్ గురించి ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి ప్రశంసలు వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ‘రైటర్ పద్మభూషణ్’ మూవీ టీమ్‌తో కలిసి చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ట్విట్టర్ వేదికగా మూవీ గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు.

రిలీజ్‌కు ముందే రైటర్ పద్మభూషణ్ ప్రొడ్యూసర్ శరత్ చంద్రతో కలిసి మహేష్‌ను SSMB28 సెట్స్‌లో కలిశాడు సుహాస్. ఈ సమయంలోనే తప్పకుండా సినిమా చూస్తానని హామీనిచ్చారు మహేష్. అన్నట్లుగానే తాజాగా మూవీ చూసిన ప్రిన్స్.. ‘రైటర్ పద్మభూషన్ చిత్రాన్ని చూస్తున్నంత సేపు ఎంజాయ్ చేశాను. చాలా హృద్యమైన చిత్రం. ప్రత్యేకించి క్లైమాక్స్ చాలా బాగుంది. ఫ్యామిలీస్ తప్పక చూడాల్సిన చిత్రం ఇది. సినిమాలో సుహాస్ నటన చాలా బాగా నచ్చింది’ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు మూవీ పెద్ద విజయం సాధించినందుకు నిర్మాతలతో పాటు మొత్తం టీమ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ పిక్ షేర్ చేశారు.

ఈ చిత్రంలో రోహిణి, ఆశిష్ విద్యార్థి, శ్రీగౌరీ ప్రియారెడ్డి, గోపరాజు రమణ ప్రధాన పాత్రల్లో నటించారు. కథ విషయానికొస్తే.. విజయవాడకు చెందిన పాతికేళ్ల ఔత్సాహిక రచయిత పద్మభూషణ్ చుట్టూ తిరుగుతుంది. అతని మధ్యతరగతి కుటుంబం, హానిచేయని స్వభావం, సున్నితమైన భావోద్వేగాలతో అల్లుకున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఈ ఫీల్ గుడ్ మూవీకి శేఖర్ చంద్ర, కళ్యాణ్ నాయక్ స్వరాలు సమకూర్చారు.

ఇక మహేష్ బాబు కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో SSMB28 చిత్రంలో నటిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేతో పాటు యంగ్ హీరోయిన్ శ్రీలీల ఫిమేల్ లీడ్స్‌గా కనిపించనున్నారు. వీరితో పాటు సముద్ర ఖని, సంయుక్త మీనన్ తదితరులు నటిస్తున్న చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తుండటం విశేషం. దీని తర్వాత మహేష్.. దర్శక దిగ్గజం రాజమౌళితో ప్రాజెక్ట్‌కు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ జూన్‌ తర్వాత సెట్స్‌పైకి వెళ్లే అవకాశముంది.

Read Latest

Tollywood updates and

Telugu news

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *