Cs Jawahar Reddy On Osd Krishna Mohan Reddy కడప జిల్లా పర్యటన సందర్భంగా తాను సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డితో కలిసి ఒకే వాహనంలో వెళ్లినట్లు జరుగుతున్న ప్రచారంంలో నిజం లేదన్నారు సీఎస్ జవహర్ రెడ్డి. తాను ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డితో కలిసి ఒకే వాహనంలో రేణిగుంటకు, అక్కడి నుంచి విమానంలో విజయవాడకు ప్రయాణించలేదన్నారు. అసలు ఆ రోజు ఏం జరిగిందో సీఎస్ క్లారిటీ ఇచ్చారు. ఈ విషయాన్ని తాను ఖండిస్తున్నానని.. అన్ని విషయాలకు క్షమాపణలు చెప్పాలన్నారు. లేని పక్షంలో బాధ్యులపై న్యాయ నిపుణుల సలహా, ప్రభుత్వ నిబంధనలకు లోబడి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జవహర్ రెడ్డి.
తాను కడప జిల్లా సింహాద్రిపురం మండలం అహోబిలపురం సమీపంలో పునర్నిర్మించిన శ్రీ భానుకోట సోమేశ్వరాలయం మహా కుంభాభిషేకానికి ముహూర్తాన్ని నాలుగు నెలల క్రితమే నిర్ణయించారని.. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తాను ఫిబ్రవరి 2న రాత్రి 11 గంటలకు రేణిగుంట నుంచి కడప వెళ్లినట్లు తెలిపారు. 3న ఉదయం కడప జిల్లా కలెక్టర్, ఇతర జిల్లా ఉన్నతాధికారులు ఆలయ కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు క్లారిటీ ఇచ్చారు.
3న మధ్యాహ్నం 3 గంటలకు తాను చదువుకున్న ముద్దనూరు జెడ్పీ హైస్కూల్‌లో విద్యార్ధులతో సమావేశం జరిగిందన్నారు. ఆ తర్వాత 4.40కి బయలుదేరి.. 8.15 గంటలకు రేణిగుంట విమానాశ్రయంలో కలెక్టర్, ఇతర అధికారులు వీడ్కోలు పలికారన్నారు. తాను రాత్రి 9 గంటలకు స్పైస్‌జెట్ ఎస్‌జీ 3003 సిరీస్ ద్వారా 1 డి సీట్‌లో ప్రయాణించి హైదరాబాద్ చేరుకున్నాను అన్నారు. ఈ వాస్తవాలు పక్కన పెట్టి శుక్రవారం రోజు సీఎస్‌తో కలసి ఓఎస్డీ విజయవాడ వెళ్లారని.. ఒకే వాహనంలో ప్రయాణించారని తప్పుడు ప్రచారం చేశారన్నారు. దారుణమైన ఈ అబద్ధాలను తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు.