10వ తరగతి పాసైన వాళ్లకు గుడ్‌న్యూస్‌.. 1793 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

Secunderabad :

సికింద్రాబాద్‌లోని రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ రిక్రూట్‌మెంట్ సెల్, ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్.. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రీజియన్లలో ట్రేడ్స్‌మ్యాన్‌ మేట్‌, ఫైర్‌మ్యాన్‌ ఖాళీల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1793 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈస్ట్రన్‌, వెస్ట్రన్‌, నార్తెర్న్‌, సదరన్‌, సౌత్ వెస్ట్రన్, సెంట్రల్ వెస్ట్, సెంట్రల్ ఈస్ట్‌ రీజియన్లలో ఈ ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల ప్రొబేషనరీ పీరియడ్‌ ఉంటుంది. పూర్తి వివరాల్లోకెళ్తే..

మొత్తం ఖాళీలు – 1793

ట్రేడ్స్‌మ్యాన్‌ మేట్‌: 1249

ఫైర్‌మ్యాన్‌: 544

ముఖ్య సమాచారం:

రీజియన్లు:

ఈస్ట్రన్‌, వెస్ట్రన్‌, నార్తెర్న్‌, సదరన్‌, సౌత్ వెస్ట్రన్, సెంట్రల్ వెస్ట్, సెంట్రల్ ఈస్ట్ రీజియన్లలో ఈ ఖాళీలున్నాయి.

అర్హతలు:

ట్రేడ్స్‌మ్యాన్‌ మేట్‌ పోస్టులకు మెట్రిక్యులేషన్‌, ఐటీఐ; ఫైర్‌మ్యాన్‌ ఖాళీలకు మెట్రిక్యులేషన్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు:

నెలకు ట్రేడ్స్‌మ్యాన్‌ పోస్టులకు రూ.18,000 నుంచి రూ.56,900; ఫైర్‌మ్యాన్‌ ఖాళీలకు రూ.19,900 నుంచి రూ.63,200 ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ:

ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌/ స్కిల్ టెస్ట్, రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం:

ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయాలి.

దరఖాస్తులకు చివరి తేదీ:

ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తు చేయాలి.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్:

https://www.aocrecruitment.gov.in/

నోటిఫికేషన్

SSC MTS 2023 : 12,523 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. 10వ తరగతి పాసైన వాళ్లు అర్హులు

SSC MTS Recruitment 2023 : కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మల్టీటాస్కింగ్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మల్టీ టాస్కింగ్ పోస్టులకు సంబంధించి మొదట 11,409 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్‌లో ప్రకటించింది. అయితే 12,523 ఖాళీలు ఉన్నట్లు ఖరారు చేస్తూ సవరించిన పోస్టుల వివరాలను తాజాగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసింది. వీటిలో రీజియన్ల వారీగా 9,329 పోస్టులు ఉండగా.. 18-27 వయసు వారీగా 2665 పోస్టులు.. ఇక హవాల్దార్ పోస్టులు 529 ఉన్నాయి. అంటే మొత్తం 12,523 ఉద్యోగాల్లో 11,994 మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఉండగా.. 529 హవాల్దార్ పోస్టులున్నాయి.

పూర్తి వివరాలకు క్లిక్‌ చేయండి

JEE Main Result 2023 : జేఈఈ మెయిన్‌ సెషన్‌ 1 ఫలితాలు ఎప్పుడో తెలుసా..?

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *