Amigos Pre Release Event: నందమూరి వంశంలో కళ్యాణ్ అన్నకు మాత్రమే ఆ రికార్డు సొంతం..ఎన్టీఆర్

Amigos Pre Release Event: కళ్యాణ్ రామ్ మాస్ సినిమాలు చేస్తూనే అందులో వెరైటీ కాన్సెస్ట్‌లకు పెద్ద పీఠ వేయడం కళ్యాణ్ రామ్ స్పెషాలిటీ. గతేడాది  బింబిసారతో హిట్‌తో బంపర్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ తాజాగా ‘అమిగోస్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో కొత్త సినిమా చేసారు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాను రాజేంద్ర రెడ్డి రచన, దర్శకత్వం వహించారు. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యల తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ నుంచి  2023లో వస్తోన్న మూడో  చిత్రం. ఇప్పటికే విడుదలైన సినిమాలో మూడు పాత్రలకు సంబంధించిన కళ్యాణ్ రామ్ లుక్స్‌‌తో పాటు టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించారు. ఇప్పటికే సిద్దార్ధ్ అనే ఎంటర్‌ప్రెన్యూర్‌గా.. మంజునాథ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పాత్రలను పరిచయం చేసిన చిత్ర యూనిట్.. టీజర్‌లో మూడో పాత్ర మైఖేల్‌ను పరిచయం చేసింది.

తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. అమిగోస్ చిత్ర దర్శకుడు రాజేంద్ర గురించి మాట్లాడుతూ.. ఇంజీనీరింగ్ చదివిన రాజేంద్ర సినిమాల్లోకి వెళ్లి డైరెక్టర్ కాలనుకున్నపుడు వాళ్ల అమ్మా నాన్నలు మంచి ఉద్యోగం చేసుకోవొచ్చుగా అన్నారు. చిత్రం మొదలైనపుడు అమ్మ కాలం చేసారు. సినిమా అయిన తర్వాత నాన్నగారు పోయారు. ఒక సినిమా కోసం ఇంతలా తపన పడిన వ్యక్తి మరోకరు ఉండరేమో. వాళ్లు ఎక్కడికి పోలేదు. ఇక్కడే ఉన్నారంటూ కాస్తంత ఎమోషనల్ అయ్యారు.

ఇక  ఫిబ్రవరి 10న సాధించబోయే సక్సెస్‌ను వాళ్లు కళ్లారా  చూస్తారన్నారు.అలాగే ఈ చిత్రానికి నిర్మాతలైన మైత్రీ మూవీ మేకర్స్ గురించి మాట్లాడాలంటే .. వాళ్లు నాకు కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ. వీళ్లు బాగా సుడి ఉంది.ఒక సమయంలో వీళ్లు నిర్మించిన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో  రెండు సినిమాలు సంక్రాంతికి విడుదలై హిట్ సాధించిన నిర్మాతలు బహుశా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎవరు ఉండరేమో.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. మా మా కుటుంబంలో ప్రయోగాత్మక చిత్రాలు చేసింది కళ్యాణ్ రామ్ ఒక్కడే. నటనలో నా కంటే సీనియర్. బాల గోపాలుడు సినిమాతోనే నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టారు. తాత, బాబాయి, నేను కమర్షియల్ చిత్రాలు చేసినా.. అన్నయ్య కళ్యాణ్ రామ్ మాత్రం ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూనే ఉన్నారు. వాటితో సక్సెస్ అందుకుంటూనే ఉన్నారు. అలా ప్రయోగత్మక చిత్రాల్లో నటించడమే కాకుండా నిర్మాతగా సినిమాలు నిర్మించడం ఒక్క  అన్నయ్య కళ్యాణ్‌రామ్‌కు మాత్రమే సాధ్యమైందన్నారు.

ఇక మధ్యలో  అతనొక్కడే, పటాస్, సినిమాలతో మాస్ సినిమాలు చేసారు. బింబిసారతో తనలోని మరో యాంగిల్ చూపించాడు. ఇక   అమిగోస్‌లో మూడు పాత్రల్లో మెప్పించారు. తాను కూడా జై లవకుశలో మూడు పాత్రల్లో నటించారు. ఒక నటుడు మూడు పాత్రల్లో నటించడం అంటే మాములు విషయం కాదు. అమిగోస్‌లో కళ్యాణ్ రామ్‌లోని మరో కోణాన్ని ప్రేక్షకులు చూస్తారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *