Amigos Pre Release Event : నా గుండెకాయ, నా తమ్ముడు.. ఎన్టీఆర్ మీద ప్రేమను కురిపించిన కళ్యాణ్‌ రామ్

Nandamuri Kalyan Ram Speech కళ్యాణ్ రామ్ హీరోగా రాబోతోన్న కొత్త చిత్రం అమిగోస్. త్రిపాత్రాభియనం చేస్తున్న ఈ సినిమాలో కళ్యాణ్‌ రామ్ నట విశ్వరూపం చూడబోతోన్నామని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఫిబ్రవరి 10న రాబోతోన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఈ సినిమా ఈవెంట్‌లో కళ్యాణ్‌ రామ్ మాట్లాడుతూ.. 

ఇక్కడకు వచ్చిన నందమూరి అభిమానులకు, నా తమ్ముడు నా గుండెకాయ మా నాన్న ఎన్టీఆర్‌కు థాంక్స్ అని చెప్పి.. అమిగోస్ సినిమా గురించి చెప్పుకొచ్చాడు కళ్యాణ్‌ రామ్. నాకు తెలిసినంత వరకు.. తెలుగులో ద్విపాత్రాభినయం రాముడు భీముడు సినిమాతో మా తాతగారు చేశారు అని అన్నాడు. ఆ తరువాత అదే టైటిల్‌తో బాబాయ్ కూడా చేశారు అని గుర్తు చేశాడు. చిరంజీవి గారు ముగ్గురు మొనగాళ్లు అనే సినిమాను చేశారని, అయితే ఈ అన్నింట్లో ఒకే కామన్ పాయింట్ ఉంటుందని, వారంతా కూడా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులని అన్నాడు.

కానీ అమిగోస్‌లో మాత్రం యూనిక్ పాయింట్‌ను చూడబోతోన్నారని చెప్పుకొచ్చాడు. మనుషులను పోలిన మనుషులు ఉంటారనే యూనిక్ పాయింట్‌తో ఈ సినిమా రాబోతోందని, ఇది కచ్చితంగా ఆడియెన్స్‌ను నిరాశపర్చదని ధీమా వ్యక్తం చేశాడు కళ్యాణ్‌ రామ్. దర్శకుడు రాజేంద్ర ఓ కొత్త పాయింట్‌ను ఎంచుకున్నాడని, బింబిసారా తరువాత మళ్లీ కొత్త కథ చేయాలని అనుకున్నానని, అలాంటి సమయంలోనే అమిగోస్ కథ విన్నానని చెప్పుకొచ్చాడు.

కొత్త సినిమాలు తీస్తే, కొత్త కథతో వస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారని కళ్యాణ్‌ రామ్ అన్నాడు. బింబిసారా టైంలో చెప్పినట్టుగానే ఇప్పుడు చెబుతూ ఉన్నానని, ఈ సినిమా మిమ్మల్ని కచ్చితంగా డిజప్పాయింట్ చేయదని మరోసారి నమ్మకంగా చెప్పాడు. ఈ సినిమాలో ఇంకో హీరో కూడా ఉన్నాడు.. అది మీకు తెలుసా?.. అతనే బ్రహ్మాజీ.. ఈ సినిమాలో అద్భుతమైన పాత్రను పోషించాడని చెప్పుకొచ్చాడు.

ఆశికకు తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోంది.. మన ఇండస్ట్రీ తరుపున వెల్కమ్ చెబుతున్నానని అన్నాడు. నేను వేసిన ప్రతీ అడుగులో నాకు తోడున్న నా తమ్ముడు, నా గుండెకాయ ఎన్టీఆర్‌కు థాంక్స్ అని చెప్పాడు. ఫిబ్రవరి 10న ఈ సినిమా రాబోతోందని, కచ్చితంగా కొత్త అనుభూతినిస్తుంది, కొత్త కమర్షియల్ సినిమాను చూడబోతోన్నారని అన్నాడు.

Also Read:  AK 62 Project Cancelled : గెలికిన అజిత్.. హర్టైన నయనతార భర్త విఘ్నేశ్ శివన్

Also Read: Samantha : జీవితంలో వెలుగుని వెతుక్కోవాలి.. సమంత పోస్ట్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ –  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ –  https://apple.co/3loQYe 

Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *