FD Interest Rates 2023: ఈ బ్యాంక్‌లో వడ్డీ రేట్లు పెంపు.. డిపాజిట్ చేస్తే భారీ లాభం

Fixed Deposit Interest Rates: ఖాతాదారులకు బంధన్ బ్యాంక్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు తెలిపింది. రూ.2 కోట్లలోపు విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన వడ్డీ రేట్లు నేటి (ఫిబ్రవరి 6) నుంచే అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది. సాధారణ ప్రజలకు ఇప్పుడు గరిష్టంగా 8 శాతం వడ్డీ రేటు లభిస్తుందని.. సీనియర్ సిటిజన్‌లు గరిష్టంగా 8.50 శాతం వడ్డీ రేటును అందుకుంటారని పేర్కొంది. గత మూడు నెలల వ్యవధిలో బంధన్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై రెండోసారి వడ్డీని పెంచడం విశేషం.  

ఇటీవల కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఇతర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్న విషయం తెలసిందే. ఈ నేపథ్యంలోనే బంధన్ బ్యాంక్ కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. 600 రోజుల కాలపరిమితి ఉన్న ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు పెరిగాయి. ఈ ఆఫర్ లిమిటెడ్ పీరియడ్ అని బ్యాంక్ ప్రకటించింది. బంధన్ బ్యాంక్ ఇప్పుడు 5,723 బ్యాంకింగ్ యూనిట్లను కలిగి ఉంది. మన దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 34 చోట్లా కలిపి మొత్తం 2.86 కోట్ల మంది వినియోగదారులకు సేవలు అందిస్తోంది.

ప్రస్తుతం 7 రోజుల నుంచి 30 రోజులలో మెచ్యూర్ అయ్యే టర్మ్ డిపాజిట్లపై బ్యాంక్ 3 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 31 రోజుల నుంచి 2 నెలలలోపు మెచ్యూరిటీ ఉన్న వాటిపై 3.50 శాతం, 2 నెలల నుంచి ఒక సంవత్సరంలోపు డిపాజిట్ అవధిపై 4.50 శాతం, ఒక సంవత్సరం నుంచి 599 రోజుల వరకు డిపాజిట్‌పై 7.25 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 

600 రోజుల్లో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లు ఇప్పుడు 8 శాతం వడ్డీ రేటును పొందుతాయి . 601 రోజుల నుంచి 5 సంవత్సరాలలోపు మెచ్యూరిటీ ఉన్నవి ఇప్పుడు 7.25 శాతం వడ్డీ రేటును పొందుతాయి. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు డిపాజిట్ అవధిపై 5.85 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఈ వడ్డీ రేట్లు అన్ని రూ.2 కోట్లలోపు రిటైల్ డిపాజిట్లకు చెల్లుబాటు అవుతాయి. సీనియర్ సిటిజన్ రేట్లు భారతీయులకు ప్రత్యేకంగా అందుబాటులో ఉంటాయి. ఎన్ఆర్‌ఐలు అర్హులు కాదు.

Also Read: Railway Track Stolen: వింత దొంగతనం.. 2 కిలోమీటర్ల రైలు పట్టాలు ఎత్తుకెళ్లిన దొంగలు   

Also Read: ప్రధాని మోదీ అండతోనే అదానీకి అపార సంపద.. రూ.10 లక్షల కోట్లు ఆవిరి: ఎమ్మెల్సీ కవిత   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ –  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ –  https://apple.co/3loQYe 

Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *