Jr NTR Health Issue : ఎన్టీఆర్ ఆరోగ్యం బాగా లేదా?.. ఎందుకలా అన్నాడు.. అసలు ఏమై ఉంటుంది?

Jr NTR Health Issue నందమూరి ఫ్యామిలీ ఎంతటి బాధల్లో ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంకా తారకరత్న కళ్లు తెరవలేదు. ఆయన పరిస్థితి మెరుగుపడలేదు. మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తీసుకెళ్తారనే వార్త కూడా వచ్చింది. అలా తారకరత్న ఇంకా ఉలుకూపలుకూ లేకుండా హాస్పిటల్ బెడ్డు మీదే ఉన్నాడు. నందమూరి ఫ్యామిలీ అంతా బాధల్లోనే ఉంది. అభిమానులు సైతం ఆందోళన చెందుతున్నారు.

ఇలాంటి సమయంలో అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఆ ఈవెంట్‌లో ఎన్టీఆర్ కూడా తన ఆరోగ్యం బాగా లేదని చెప్పేశాడు. దీంతో అభిమానులు మరింతగా ఆందోళన చెందుతున్నారు. అమిగోస్ ఈవెంట్‌లో మాట్లాడేందుకు మైక్ అందుకున్నాడు. ఇక అభిమానుల గోలలు ఎక్కువయ్యాయి. ఎంతగా సర్దిచెబుదామన్నా కూడా వాళ్లు వినలేదు. దీంతో తన పరిస్థితి గురించి వివరించాడు.

 

ఆరోగ్యం బాగా లేకపోయినా అభిమానుల కోసం ఇంత దూరం వచ్చానన్నట్టుగా ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ఎక్కువ సేపు నిల్చునే ఓపిక కూడా లేదు.. కాస్త వ్యవధి ఇస్తే మాట్లాడాల్సింది మాట్లాడేస్తాను అని అభిమానులను వేడుకున్నాడు. దీంతో ఎన్టీఆర్‌కు ఏమై ఉంటుంది?ఎందుకు అలా మాట్లాడాడు? ఏదైనా సీరియస్‌ హెల్త్ ఇష్యూనా? లేదంటే నార్మల్‌గా వచ్చిన ఫీవర్ లాంటిదా? అని జనాలు కంగారు పడుతున్నారు.

అయితే ఇప్పుడు సీజన్లు మారుతున్నాయ్ కాబట్టి.. ఇవన్నీ కామన్ అయి ఉంటుందని కొందరు అంటున్నారు. అయితే ఎన్టీఆర్ మాత్రం ఈవెంట్‌ మొత్తంలో ఎక్కడా కూడా డల్‌గా కనిపించలేదు. నవ్వుతూనే కనిపించాడు. బ్రహ్మాజీ, సుమలకు తన స్టైల్లో కౌంటర్లు వేశాడు. మొత్తానికి ఎన్టీఆర్ కొరటాల శివకు సంబంధించిన అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Also Read:  AK 62 Project Cancelled : గెలికిన అజిత్.. హర్టైన నయనతార భర్త విఘ్నేశ్ శివన్

Also Read: Samantha : జీవితంలో వెలుగుని వెతుక్కోవాలి.. సమంత పోస్ట్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ –  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ –  https://apple.co/3loQYe 

Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *