Pathaan :12 రోజుల్లో రూ. 414 కోట్లు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది.రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 414.50 కోట్లు కొల్లగొట్టినట్లుగా ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. అత్యంత వేగంగా రూ. 400 కోట్ల మార్కును దాటిన హిందీ చిత్రంగా పఠాన్ మూవీ రికార్డు నెలకొల్పింది. హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో దంగల్ మూవీ సాధించిన రికార్డులను అధిగమించిన ఈ చిత్రం.. ఇప్పుడు కేజీఎఫ్2, బాహుబలి2 రికార్డులపై గురి పెట్టింది. 2013లో ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ చిత్రంతో ఇలాంటి సూపర్ హిట్ అందుకున్న షారుఖ్.. మళ్లీ పదేండ్ల తర్వాత ఆ స్థాయి విజయాన్ని దక్కించుకున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఇందులో షారుఖ్ ఖాన్ రా ఏజెంట్‌గా నటించగా.. అతనిగా జోడీగా దీపికా పదుకొనే కనిపించింది. జాన్ అబ్రహం విలన్ రోల్ లో నటించాడు.
©️ VIL Media Pvt Ltd.