Rohit Sharma Captain: రోహిత్‌ శర్మ ముందు అరుదైన రికార్డు.. భారత క్రికెట్‌ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాలేదు!

Rohit Sharma eye on Rare Record in Border Gavaskar Trophy 2023: భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే టెస్ట్ సిరీస్.. బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ. ఈ ట్రోఫీ దక్కించుకోవాలని ఇరు జట్లు హోరాహోరీగా పోటీ పడుతుంటాయి. యాషెస్ సిరీస్ తర్వాత బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీని క్రికెట్ ప్రేమికులు ఎక్కువగా ఆస్వాదిస్తారు. భారత్‌, ఆస్ట్రేలియాల మధ్య బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ మరో మూడు రోజుల్లో ఆరంభం కానుంది. 4 టెస్టుల సిరీస్‌లోని తొలి టెస్ట్ నాగపూర్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ నేపథ్యంలో భారత క్రికెట్‌ చరిత్రలో ఏ కెప్టెన్‌కు సాధ్యంకాని ఓ అరుదైన రికార్డును నెలకొల్పే అవకాశం రోహిత్‌ శర్మ ముందు ఉంది. 

ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభం కాబోయే బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ 2023లో హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ ఓ సెంచరీ చేస్తే.. కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన తొలి భారత సారథిగా రికార్డుల్లోకి ఎక్కుతాడు. రోహిత్‌ తన కెరీర్‌లో ఇప్పటివరకు కెప్టెన్‌గా.. వన్డే, టీ20ల్లో సెంచరీలు బాదాడు. టెస్ట్‌ కెప్టెన్‌గా మాత్రం హిట్‌మ్యాన్‌ ఒక్క సెంచరీ చేయలేదు. ప్రస్తుతం మంచి ఫామ్ కనబర్చుతున్న రోహిత్.. ఈ రికార్డు నాగపూర్ టెస్టులోనే సాధించే అవకాశం ఉంది. బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ భాగంగా జరిగే 4 టెస్ట్‌ల్లో హిట్‌మ్యాన్‌ ఒక్క సెంచరీ చేసినా సరిపోతుంది. 

టెస్ట్‌ల్లో రోహిత్‌ శర్మ 8 సెంచరీలు చేసినా.. అవన్నీ ఆటగాడిగా చేసినవే. భారత దిగ్గజ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీలు కూడా సారథిగా మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేయలేదు. గంగూలీ, ధోనీలు కెరీర్ ఆసాంతం టీ20ల్లో సెంచరీలు చేయలేదు. టీ20, వన్డే, టెస్టుల్లో కోహ్లీ సెంచరీలు చేసినా.. కెప్టెన్‌గా వన్డే, టెస్టుల్లోనే బాదాడు. కెప్టెన్సీకి వీడ్కోలు చెప్పిన అనంతరం.. ఇటీవల టీ20ల్లో విరాట్ శతకం బాదాడు. దాంతో అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకునే అవకాశం హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మకు వచ్చింది. 

బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ 2023లో రోహిత్‌ శర్మ శతకం చేస్తే.. ఓవరాల్‌గా మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన నాలుగో కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. శ్రీలంక మాజీ కెప్టెన్‌ తిలకరత్నే దిల్షాన్‌, దక్షిణాఫ్రికా మాజీ సారధి ఫాఫ్‌ డుప్లెసిస్‌, పాకిస్తాన్ కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్‌ ఈ రికార్డు సాధించారు. అందరికంటే ముందుగా మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసింది తిలకరత్నే దిల్షాన్‌. 

Also Read: Infosys Fresher Employees: శిక్షణ అనంతరం.. 600 మంది ఉద్యోగులను తొలగించిన ఇన్ఫోసిస్!  

Also Read: IND vs AUS: ఆస్ట్రేలియాపై ఆడటమంటే విరాట్‌ కోహ్లీకి మహా ఇష్టం.. కారణం ఏంటో చెప్పిన భారత మాజీ కోచ్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ –  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ –  https://apple.co/3loQYe 

Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *