Rs 10 Note: ఈ 10 రూపాయల నోటు ఉంటే మీరు లక్షాధికారి కావచ్చు.. ఎలాగంటే..!

Ten Rupee Note Sale: పాత నోట్లు, నాణేల బదులు లక్షల రూపాయలు పొందవచ్చనే వార్తలను మీరు ఇప్పటికే చూసి ఉంటారు. అయితే వీటిని నిజంగా కొంటారా..? అని కూడా అనుమానం వ్యక్తం చేసే ఉంటారు. ఆ డౌటేమి మీకు అక్కర్లేదు. మీ దగ్గర పాత నోట్లు ఉంటే ఎంచక్క ఆన్‌లైన్ అమ్మేసుకోవచ్చు. చాలా దేశాలు తమ కరెన్సీలో ఎప్పటికప్పుడు కొన్ని అప్‌డేట్‌లను కూడా చేస్తాయి. భారతీయ కరెన్సీలో కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లు చాలాసార్లు కనిపిస్తాయి. మన దేశంలోని కొన్ని నోట్లు, నాణేలు ఉన్నాయి. వాటి విలువ వాటి అసలు కంటే చాలా ఎక్కువ రేట్లు పెరిగిపోయాయి. అలాంటి ఓ 10 రూపాయల నోటు తెలుసుకోండి.

ప్రస్తుతం 10 రూపాయల నోటుపై చర్చ జరుగుతోంది. ఈ 10 రూపాయల నోటు ప్రత్యేకత ఏంటంటే.. ఈ నోటు చాలా పాతది. దాని వెనుక నెమలి బొమ్మ కూడా ఉంది. ఈ నెమలితో ఉన్న 10 రూపాయల నోటు ధర నేడు వేల రూపాయల్లో ఉంది. అయితే రూ.10 నెమలి నోటు లభించడం అంత ఈజీ కాదు. ఈ నోట్లు మార్కెట్లో చాలా అరుదుగా కనిపిస్తాయి. ఇలాంటి నోట్లు మీ దగ్గర ఉంటే మిమ్మల్ని ధనవంతులను చేస్తాయి. మీ వద్ద 10 రూపాయల నెమలి నోటు ఉంటే అది మీకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది.

మీ వద్ద 10 రూపాయల నెమలి నోటు ఉండి.. దాని క్రమ సంఖ్య కూడా మెరుగ్గా ఉంటే.. ఆ నోట్ల ధర మరింత పెరుగుతుంది. ఉదాహరణకు ఈ నోటు సీరియల్ నంబర్‌లో 786 సంఖ్య ఉంటే దాని విలువ భారీగా పెరుగుతుంది. సీరియల్ నంబర్ సాధారణం కానిది అయినా దాని విలువ ఎక్కువగా ఉంటుంది. అలాంటి నోట్ల ధర రూ.30 వేల నుంచి లక్షల వరకు ఉంటుంది. ఈ నోట్ మీ వద్ద ఉంటే.. ఈ నోట్లను ఆన్‌లైన్‌లో అమ్మవచ్చు. Ebay, Quikr, Coinbazaar వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు ఈ నోట్లను అమ్మడం ద్వారా చాలా డబ్బు సంపాదించవచ్చు.

Also Read: PM Kisan: పీఎం కిసాన్ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. నగదు ఎప్పుడు జమకానుందంటే..?  

Also Read: Ponguleti Srinivas Reddy: దమ్ముంటే నన్ను సస్పెండ్ చేయండి.. బీఆర్ఎస్ అధిష్టానానికి పొంగులేటి ఓపెన్ ఛాలెంజ్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ –  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ –  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *